Friday, November 22, 2024

దసరా తర్వాత కోర్టుల్లో భౌతిక విచారణలు

- Advertisement -
- Advertisement -
Hope There Are No More Covid Waves Says NV Ramana
మరో వేవ్ ఉండకపోవచ్చు: సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ ఎన్‌వి రమణ

న్యూఢిల్లీ: దేశంలోని కోర్టుల్లో దసరా తర్వాత ఆఫ్‌లైన్(భౌతిక) విచారణలను పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు. దేశాన్ని కరోనా మరోవేవ్ తాకకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవాదులు,సిబ్బంది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్ విచారణలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు. తనతోపాటు ఇటీవలే నియామకాలు పొందిన 9 మంది జడ్జిల కోసం మహిళా న్యాయవాదులు నిర్వహించిన అభినందనసభలో జస్టిస్ రమణ ప్రసంగించారు.

మహమ్మారి సమయంలోనూ భౌతిక విచారణలకు సిద్ధపడ్డామని.. అయితే, సీనియర్ న్యాయవాదుల అభ్యంతరంమేరకు ఆన్‌లైన్ విచారణలు చేపట్టామని జస్టిస్ రమణ తెలిపారు. కోర్టు రూంలో గ్లాస్ తెరలతో రక్షణ ఏర్పాట్లు ఉండటం వల్ల జడ్జిలకు సమస్య ఉండదని, న్యాయవాదులు, సిబ్బందికి మాత్రం కొన్ని ఇబ్బందులుంటాయని ఆయన అన్నారు. భౌతిక విచారణల విషయంలో ప్రామాణిక విధానాలను(ఎస్‌ఒపిలను) అనుసరించాలని కొందరు న్యాయవాదులు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ రమణ తెలిపారు. కొందరు థర్డ్‌వేవ్, ఫోర్త్‌వేవ్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అలాంటివి ఉండకపోవచ్చని ఆశిస్తున్నానని జస్టిస్ రమణ అన్నారు. దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత 2020 మార్చి నుంచి న్యాయస్థానాల్ని కొన్నిరోజులపాటు మూసివేసిన విషయం తెలిసిందే. పరిస్థితి కొంత కుదుటపడిన తర్వాత ఆన్‌లైన్ విచారణలను ప్రారంభించారు. ముఖ్యమైన కేసుల్లో జడ్జిలు వ్యక్తిగతంగా భౌతిక విచారణలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News