Monday, December 23, 2024

ఆ నిర్ణయంపై భారత్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నాం: అమెరికా

- Advertisement -
- Advertisement -

Hopefully India will reconsider that decision: US

వాషింగ్టన్ : గోధుమ ఎగుమతులపై విధించిన నిషేధంపై భారత్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్టు అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ పేర్కొన్నారు. దేశంలో నిత్యావసర ధరలను నియంత్రించే ఉద్దేశంతో గోధుమ ఎగుమతులపై నిషేధం విధిస్తూ గత వారం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమలు లోకి వస్తుందని పేర్కొంది. అయితే భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల తమ దేశంలో గోధుమ కొరత ఏర్పడుతుందని, ఈ నిర్ణయంపై భారత్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్టు న్యూయార్క్ లోని గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పేర్కొన్నారు. “ భారత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను చూశాం. ఎగుమతులను పరిమితం చేయొద్దు. ఏ దేశానికైనా మేము ఇదే విషయం చెప్తాం. ఎగుమతులపై ఏవైనా పరిమితులు ఉంటే అవి ఆహార కొరతను మరింత తీవ్రతరం చేస్తాయని మేం భావిస్తున్నాం. అయినా భారత్ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంది. ఇతర దేశాలు లేవనెత్తుతున్న ఆందోళనలను బహుశా భారత్ వినే ఉంటుంది. ఈ నిర్ణయంపై పునరాలోచిస్తారని ఆశిస్తున్నాం” అని లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News