మన తెలంగాణ/హైదరాబాద్ :మండుతు న్న ఎండలతో విలవిల లాడుతున్న దేశ ప్ర జలకు భారతవాతావరణ శాఖ చల్లటి కబురందించింది. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితు లుతగ్గిపోవడం,యురేషియాలో తగ్గిన మం చు కవచంతో నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తె లిపారు. మనదేశంలో
ఎల్ నినో క్షీణిస్తుండటం గుడ్ న్యూస్ లాంటిదని, జూన్ నెల మొదలయ్యే సమయానికి ఎల్ నినో తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయిపోతాయని, రుతుపవనాల సీజన్ జులై-సెప్టెంబర్ రెండో అర్ధభాగంలో మన దేశంలో లా నినా పరిస్థితులు ఏర్పడవచ్చని మహాపాత్ర వివరించారు. దేశంలో రుతుపవనాలపై ఉత్తర హిమాలయాలు, యురేషియా భూభాగంపై ఉండే మంచు కవచం ప్రభావం చూపిస్తాయని తెలిపారు.
ఎల్ నినో ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉత్తర హిమాలయాలు, యురేషియా భూభాగంపై మంచు కవచం తక్కువ మోతాదులోనే ఉందని, ఇది రుతుపవనాలకు కలిసొచ్చే పరిణామమని పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లలో సగానికిపైగా వ్యవధిలో (దాదాపు 60 శాతం) రుతుపవనాలపై ఎల్ నినో ప్రతికూల ప్రభావాన్ని చూపించిందని, గత ఏడాది రుతుపవనాల సీజన్‌లో మన దేశంలో సగటున 820 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని తెలిపారు.దేశవ్యాప్తంగా ఏటా కురిసే సగటు వర్షపాతం 868.6 మి.మీతో పోలిస్తే ఇది చాలా తక్కువ అన్నారు ఎల్ నినో ఎఫెక్టు వల్లే గత సంవత్సరం వర్షపాతం తగ్గిందిదని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల సూచనలను ఈ నెలాఖరులోనే భారత వాతావరణ విభాగం విడుదల చేయనుందని ఐఎండి డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.