మేషరాశి :
ఆదాయం: 02 వ్యయం: 14
రాజ: 05 అవమానం: 07
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు.
మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ సంవత్సరం గ్రహస్థితి వ్యయంలో శని, మే 15 మిథునంలో గురువు సంచారం, అలాగే మే 19 నుండి సింహంలో కేతువు, కుంభంలో రాహు సంచారం కొన్ని మంచి ఫలితాలు, కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలిననాటి శని ప్రారంభం అయ్యింది. శనికి జపాలు, అభిషేకాలు, అఘోర పాశుపత ెమం చేయించడం చెప్పదగిన విషయం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఏ విషయంలో కూడా తొందరపడరు. మీరు చేసిన కృషి నిదానంగా ఫలిస్తుంది. ఒక పెద్ద అవకాశం కలిసి వస్తుంది. మీలో ధైర్యం, శ్రమించే గుణం పెరుగుతాయి. కొన్ని ఆగిపోయిన పనులు ఈ సంవత్సరం మధ్యలో పూర్తవుతాయి. వ్యాపార పరంగా పురోగాభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. కాని కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. విలువైన భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు. రాజీలేని మీ భావాలకు, మీ పనితనానికి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. వివాదస్పద విషయాలు, కోర్టు పరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థితి సాధించినప్పటికీ మరింత పురోగతి సాధించాలని కష్టపడతారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. చాలా కఠినమైన వ్యక్తులుగా పేరు వస్తుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు గొప్పగా రాణిస్తారు. చాలా శ్రమించి, ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి వస్తారు.
సంతాన పురోగతి మీకు సంతోషం కలిగించే విధంగానే ఉంటుంది. కెరియర్ పరంగా అవకాశాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు సాధిస్తారు. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. శత్రువులు అధికమవుతారు. ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువర్గాన్ని మిత్రులుగా చేసుకుని ముందుకు వెళ్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ దాక వెళ్ళే పరిస్థితి గోచరిస్తున్నది. శని స్తోత్రం, గణపతి అష్టోత్తరం ఎక్కువగా పఠించాలి.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. ెటల్ వ్యాపారం, మేనేజ్మెంట్ కోర్సు, కన్సల్టెన్సీ, మ్యారేజీ బ్యూరో నడిపే వారికి, ఫై నాన్స్ సెక్టర్స్‌లో ఉన్న వారికి, జ్యూవలరీ వ్యాపారస్తులకు, ఆర్టిఫిషల్ జ్యూవలరీ, కాస్మొటిక్స్ వారికి ఈ సంవత్సరం బాగుంది. వ్యాపారంలో లాభాలు చూస్తారు. దీనివల్ల జీవితంలో కొత్త ఆ శలు చిగురిస్తాయి. కుటుంబంలో పెద్దల ఆరో గ్యం కుదుటపడుతుంది. బంధుమిత్రులతో విభేదాలు తరుచూ కుటుంబంలో మనశ్శాంతి లే కుండా చేస్తాయి. మీ వ్యక్తిత్యానికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారు. సంతృప్తికరమైన ఆర్థిక వనరులు మీలోని ఉత్సాహాన్ని మరింతగా పెంచుతాయి. సమాజంలోని ఉన్నతస్థాయి వారితో మిత్రత్వం ఏర్పడుతుంది. పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు. అదృష్టాన్ని నమ్ముకోకుండా కృషి కి ప్రాధాన్యతనిచ్చి అధికంగా శ్రమించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. పొదుపు ప్రయత్నా లు ఫలిస్తాయి. డబ్బుల విషయంలో గతంలో మీ ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు తేడా వస్తుంది.
2025 మార్చి 29వ తేదీ నుండి శని మీన రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి మేషరాశి వారికి ఏలిననాటి శని ప్రారంభం అవుతుంది. శని మనం రోజువారి చేసే పనులకు, మన కర్మలకు కారకుడు. జాతకంలో శని బాగుంటే ఆ వ్యక్తి జాతకం బాగుంటుంది. శని జాతకంలో బాగున్న వ్యక్తి బద్దకానికి, పనులను వాయిదా వేసే పద్ధతులకు దూరంగా ఉంటాడు. న్యాయ మార్గంలో నడుచుకుంటాడు. అందుకే మన ఆలోచనలకు, మనసుకు కారకుడైన చంద్రుడు, మన అహంకారానికి, అధికారానికి కారకుడైన రవి శనికి శత్రువులయ్యారు. జాతకంలో శని గ్రహ స్థితి బాగాలేకుంటే బద్ధకం, అసహనం, ప్రక్కదొవ పట్టడం, చెడు పనులు చేసే వ్యక్తులుగా ఉంటారు. దాని కారణంగా ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి అనేది తొందరగా జరగదు. శని 12వ ఇంట ఉన్న సమయంలో డబ్బు ఖర్చు చేసే విషయంలో అహంకారానికి పోవడం, లేదా విలాసాల కోసం ఖర్చు చేయడం తగ్గించుకుంటే మంచిది. దీనికి పరిహారంగా శనికి సంబంధించిన పూజలు అనగా ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత ెమం చేయడం చెప్పదగిన సూచన.
దీర్ఘకాలిక ఆశయాలు నెరవేర్చుకోవాడానికి, కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులతో చర్చలు సాగిస్తారు. వృత్తివ్యాపారాలు నిదానంగా సాగుతాయి. లాభం నష్టం, మంచి చెడు అన్నీ సమపాళ్ళలో ఉన్నట్లు తోస్తుంది. దేనికైనా సమయం కలిసి రావాలని మిమ్మల్ని మీరే ఓదార్చుకుంటారు. గొప్పలు చెప్పుకునే కొందరు స్వార్ధపరు లు స్థిరాస్తుల విషయంలో మిమ్ములను మోసం చేయడానికి ప్రయత్నించి భంగపడతారు. పరోపకారం చేసే వాళ్ళను మీరు ప్రోత్సహిస్తారు. ఇందువల్ల అనుకోని ముఖ్యమైన వ్యక్తులకు దగ్గరవుతారు. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. మీ కీర్తి, పేరు ప్రఖ్యాతలు ఇతరులు సొమ్ము చేసుకునే ప్రయత్నాలను గట్టి గా అడ్డుకుంటారు. చాలాకాలంగా చేయలేని ఈ పనిని పూర్తి చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఋణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులు వెన్నుదన్నుగా నిలుస్తారు. ఆత్మీయవర్గంలో అతి ముఖ్యమైన వారి తో కష్టసుఖాలను పంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన సలహాలు తీసుకుని చికాకులు పడే అవకాశం ఉంది. కావున ప్రతి పనిని, ప్రతి విషయాన్ని స్వయంగా చేసుకోవడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం గోచరిస్తోంది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వలన లాభపడతారు. కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు. పరిస్థితులు అందుకు అనుకూలించవు. బ్యాంక్ ఋణాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఐక్యత కోసం శ్రమిస్తారు. వ్యక్తిగత హామీలు మాత్రం ఇవ్వకండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్నికొన్ని విషయాలలో కొందరి సహకారం లభించినప్పటికీ దానిని మీరు సద్వినియోగం చేసుకొకపోవచ్చు. మీరు చేపట్టిన పనిని పూర్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేయవలసి ఉంటుంది. కోర్టు తీ ర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. తీర్పులకు సంబంధించిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా అమలులోకి వస్తాయి. గతంలో జరిగిన పొరపాట్లు అందువల్ల ఏర్పడిన పరిస్థితులను సరిదిద్దుకుంటారు. ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఓ ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు.
విద్యార్థినీ విద్యార్ధులకు మంచి అవకాశాలు కలిసివస్తాయి. ఇంత వరకు ఆలోచనలకే పరిమితం చేసిన వాటిని ఆచరణలోకి తెస్తారు. గ్రూప్స్ ఎగ్జావ్‌సు రాసిన వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యంగా అయినా ఉద్యోగం వస్తుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో అనుమానం, మానసిక ధైర్యం సన్నగిల్లుతూ మీ పురోగతికి మీరే అడ్డుపడినట్లుగా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు సాగడం మంచిది.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు, అన్నీ సాధ్యమైనంతవరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు. కాలమే అన్ని ప్రశ్నలకు, సమస్యలకు సమాధానం చెప్పగల శక్తివంతమైనదని ఆ కాలం భగవంతుని సంకల్పం ప్రకారం నడుస్తుందనే నమ్మకం కలిగి ఉంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే బాగుంటుదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏలిననాటి శని ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి కాలభైరవ రూపు ధరించడం, ఎనిమిది (8) శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత ెమం చేయించడం, ఏదైనా పనిమీద వెళ్ళేటప్పుడు బుధవారం, శుక్రవారం వెళ్ళండి మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభరాశి :
ఆదాయం: 11 వ్యయం: 05
రాజ: 01 అవమానం: 05
కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల యందు పుట్టినవారు.
వృషభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది.గృహ నిర్మాణ కార్యక్రమాలలో, కుటుంబ వ్యవహారాలలో ఒక నిర్ణయానికి వస్తారు. ఋణ బాధల నుండి, సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి నుండి తొమ్మిదవ ఇంటికి, పదవ ఇంటికి శని భగవానుడు అధిపతి. మార్చి 29వ తేదీ నుండి 11వ ఇంట్లో శని భగవానుడు సంచరిస్తారు. మీన రాశిలో శని సంచారం కాబట్టి వృషభ రాశి వారికి కూడా శ ని గ్రహ అనుకూలత కారణం చేత చాలా వరకు శుభ ఫలితాలు, చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. శనిగ్రహ సానుకూలత వల్ల చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన దానికంటే మెరుగుపడుతుంది.
ఈ వృషభ రాశిపై రాహువు మరియు కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం. భవిష్యత్ కార్యక్రమాల గురించి, ఖచ్చితమైన నిర్ణయాలు, ప్రణాళికలు చేస్తారు. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతుంటాయి. అయినప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
కోర్టు తీర్పులు మీకు అనుకూలంగానే ఉంటాయి. రైతులకు పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దత్తు ధర మీరు ఆశించినంత లభించకపోవచ్చు. వైద్యులకు, న్యాయ వాదులకు ఆదాయం బాగుంటుంది. గతంలో కంటే ఆదాయం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతుంది. మీకు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ నైపుణ్యానికి, సామార్ధ్యానికి లభించిన ఒక సదావకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించు కుంటారు. మీకు వచ్చిన సమస్యలను కోర్టులకు, పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం ఉత్తమం.
ఉద్యోగస్తులకు చెప్పుకోదగిన మార్పులేవీ ఉండవు. ఎవరిపైన ఆధారపడవద్దు. స్వయంకృషితోనే మీరు అనుకున్నది సాధిస్తారు. మీ సంకల్ప సిద్ధికి ఓర్పు, సహనం, కృషి అవసరం. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ దృష్టిలో ఇది కీలకమైన సంవత్సరము. ఈ సంవత్సరం సాధించే ఫలితాలను బట్టి భవిష్యత్తులో ముఖ్యమైన ఘట్టాలు ఆధారపడి ఉంటాయని భావించండి. మీ స్థాయికి తగని వ్యక్తులతోటి వా దోపవాదాలు చోటు చేసుకుంటాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మీకు ఎటువంటి అసౌకర్యము ఏర్పడదు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోకపోవటమే ఇందుకు కారణమవుతుంది. పట్టు విడుపు, లౌక్యము లేనిదే కార్యసాధన కష్టమని గ్రహిస్తారు. ఆచరణలో కూడా పె డతారు. సొంత నిర్ణయాల కన్నా మిత్రుల సలహాలు, సూచనలు ఎక్కువగా పాటిస్తారు.
రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ కంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకుంటారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు సంపాదింస్తారు. మీ నైపుణ్యానికి, సామార్ధ్యానికి లభించిన ఒక సదావకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుటారు. వ్యక్తిగత నిర్ణయాలు మీకు అంతగా లాభపడవు. మీతో ఉన్నవారిని అతిగా నమ్మవద్దు. మిమ్మల్ని పొగిడి వారు లబ్ధిపొందుతారు. చివరికి మీకు చెడ్డపేరు కూడా తెచ్చేవారు మీ చుట్టూ ఉన్నారని మీరు గుర్తించి వారిని సాధ్యమైనంత వరకు దూరం పెట్టడం ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడవచ్చు.
వ్యాపారస్తులకు వ్యాపారంలో సంతృప్తి చెందరు. వ్యాపారంలో మరిన్ని లాభాలు రావాలంటే ఏమి చేయాలని ప్రశ్నించుకుంటారు. ఆ దిశగా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. టెండర్లు, జాబ్‌వర్క్‌లు, ఎగుమతి ఆర్డర్లు అనుకూలిస్తాయి. అయితే ఆదాయ వ్యయాలు మాత్రం మీరు ఊహించిన దానికంటే విరుద్దంగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
మే15 2025న గురుగ్రహ మార్పులతో కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అప్పులు తీర్చి వేస్తారు. సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇండిపెండెంట్‌గా బిజినెస్ చేస్తే బాగుంటుంది. లేదా పార్టనర్ షిప్‌తో బిజినెస్ చేయాలంటే వారి జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. మీకు బిజినెస్ కలిసివస్తే అవతలి వారికి బిజినెస్ కలిసిరాకుంటే ఇందులో మీరే ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి అన్ని చూసుకుని వెళ్ళడం మంచిది.
సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానప్రాప్తి కలిగే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. అన్నదమ్ములతో, బంధువర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి.
విద్యార్ధినీ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైప్పటికీ మంచి ఫలితాలు సాధించ గలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మొటిక్స్, సినీ రంగం లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మే 2025 నుండి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం చేతిదాకా వచ్చి చేజారిపోతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఉండ వు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలకాలం. మాటను అదుపులో ఉం చుకోవాలి.ఉద్యోగపరమైన ఒత్తిళ్ళను తట్టుకుంటారు. సహుద్యోగులతో కలివిడిగా ఉంటారు. అవసరమైన సమయంలో వృత్తి పరంగా సహాయం అందించలేరు. అది మీపై ఒకరకమైన అభిప్రాయం ఏర్పడుతుంది.
సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతా నం యొక్క చదువులు దగ్గర ఉండి చూసుకుంటారు. వారి ప్రతిభని మీరు గమనించుకుంటూ వారి ప్రోత్సహిస్తుంటారు. పిల్లల ఉన్నతి కోసం మీరు పాటు పడతారు. మంచి సంబంధం వ స్తుంది. వివాహం ఘనంగా నిర్వహిస్తారు. వివాహం జరిపించే ముందు వధూవరుల జాతక పరిశీలన చేసుకుని వివాహ పరంగా ముందడుగు వెయ్యండి. నలుగురిలో బాగా చేసారు అని మెప్పులు పొందుతారు. దిష్టి కూడా పడతారు. ఎవరి కష్టాన్ని ఆశించకుండా మీకు మీరు ఎదిగారన్న పేరు వస్తుంది.
అనవసరమైన వ్యక్తుల గురించి చర్చించడం, మీకు సంబంధంలేని విషయాల గురించి బహిరంగంగా ప్రకటనలు చేయడం మంచిది కాదు. మీకు తెలిసిన విషయాలు ఏవైనా వాటికి ఆధారాలు లేకుండా మాట్లాడవద్దు. మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని గమనించండి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం, ఎనిమిది (8) మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ లేదా నెలకు ఒకసారి చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత ెమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు సుందరకాండ పారాయణం చేయించండి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం, శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.
మిధునరాశి :
ఆదాయం: 14 వ్యయం: 02
రాజ: 04 అవమానం: 03
మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదముల యందు పుట్టినవారు
మిథునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎలాంటి సం దేహం లేదు.ఈ సంవత్సరం మిథునరాశి వారికి విపరీత రాజయోగం అనేది ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. గురు గ్రహ అనుకూలత వలన మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సం ఘంలో గౌరవ మర్యాదలతొ పాటు పేరు ప్రతిష్టలు ఆర్జిస్తారు.
మిథున రాశి వారికి శని భగవానుడు ఒక రకంగా మంచే చేస్తారు. 2025 మార్చి 29 తేదీ తరువాత శని 10వ ఇంట్లో సంచరిస్తాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడికి శని భగవానుడికి ఉన్న స్నేహ భావం వలన ఈ సంచారం అనేది మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి.
వస్త్ర వ్యాపారాలను ఒక చోట నుండి మరొక చోటుకి విస్తరింపచేస్తారు. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నిర్మాణపు పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సంఘం లో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. నిర్మాణరంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, స్టీల్, వైద్య వృత్తి, సూపర్ మార్కెట్, వ వ్యాపారస్తులకు, బంగారు ఆభరణాలు, ఆర్టిఫిషల్ జ్యువెలరీ, ఫర్నీచర్, ఫాస్ట్‌ఫుడ్స్, ెటళ్ళు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మే నుండి బాగుంటుంది. రైతులకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఆశించినంత పంట వచ్చినా కూడా సరైన ధర పలికినా మీ చేతికి కొంత వరకే అందుతుంది. మిగిలినదంతా దళారుల చేతిలో ఉంటుంది పంట మీది రాబడి వాళ్ళది అన్నటు ఉంటుంది.
రాజకీయ పరపతితో ముఖ్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీ య పదవులు లభిస్తాయి. ఎదుటివాళ్ళ వ్యూ హం గమనించి, ఎత్తులకి పైఎత్తులు వేస్తారు. మీ ప్రతిష్టను కాపాడుకుంటారు. రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు సమస్యలను సృష్టిస్తారు.
ఉద్యోగస్తులకు కొన్ని అవకాశాలు చేయి దాకా వచ్చి జారిపోయినా దైవాను గ్రహం వల న మంచి అవకాశాలు లభిస్తాయి. మంచిఉద్యోగము లభిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్‌లు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి ఆలోచనా విధానంలో కలిసి పని చేయం డి. తప్పక కలిసి వస్తుంది. గ్రీన్‌కార్డు కోసం ప్ర యత్నిస్తున్న వారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. హె చ్1బి కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇ బ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయి తే పట్టుదల వల్ల సమస్యలను పరిష్కరిస్తారు.
వివాహం కాని వారికి వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. క్రెడిట్ కార్డులు, బ్యాంక్ వ్యవహారాలు, చిట్‌ఫండ్స్ మొదలైన వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల దృష్ట్యా అమ్మకానికి సంబంధించి ఆటంకాలు వస్తాయి. అమ్మపోతే అడవి అన్నట్టు అవుతుంది, కొనుగోలు దారులు కరువవుతారు. కొనటానికి వచ్చినా తగిన రేటు పలకదు. ఎంతో కాలంగా పెండిగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
సంతానానికి సంబంధించిన విషయాలలో విశేషమైన శ్రద్ధ వహిస్తారు. అధికమైన ధనాన్ని ఖర్చు చేస్తారు. మీకు సంబంధంలేని వివాదస్పద విషయాలలో దూరంగా ఉండండి. ఆర్థికపరమైన మినహాయింపులు ఇన్‌కంటాక్స్‌కు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందువలన కీర్తి లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గ్రహగతుల సంచార రిత్యా ఈ సంవత్సరం చా లా సమస్యల్ని అధిగమించగలుగుతారు. చెప్పుకోదగిన పురోగతి సాధించగలుగుతారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు.
విద్యార్థిని విద్యార్ధులకు విద్య సంబంధమైన విషయాలు బాగున్నాయి. మెరిట్ మా ర్కులు సాధిస్తారు. అందరు మీరు ఎక్కువగా చదవరు కాని మంచి మార్కులు వచ్చాయి అని ఆలోచిస్తారు. మీ సమయస్ఫూర్తి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. అని అందరికీ తెలియదు. వైద్య విద్య, ఎవ్‌ుబిఏ ఫైనాన్స్ సెక్టర్స్, సాఫ్ట్‌వేర్ వారికి అనుకూలమని చెప్పవచ్చు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద విదేశీయానం లాభదాయకంగా ఉంది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిఉద్యోగాలలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగం మారాలకునే వారికి మే 2025 తరువాత ప్రయత్నాలు చేయండి. చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ సంవత్సరం బాగుంది. విదేశాలకు వెళ్ళాలి అ నుకునే వారు ప్రయత్నాలు చేయవచ్చు. ప్రభు త్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తా యి. ఒత్తిళ్ళను సైతం పక్కన పెట్టి కృషి చేస్తారు. తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందురు మీరు ఎంతో సంపాదిస్తున్నారు అనే నరదిష్ఠి ఉంటుం ది. గ్రీన్‌కార్డ్, హెచ్1బి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే డాక్యుమెంట్స్ విషయంలో జా గ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధమైన వి షయాలు బాగున్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారుకి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. తెలసిన వాళ్ళ సంబంధం బాగుంటుంది. అని కాకుండా అన్నీ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తరువాత ఇబ్బంది పడేకంటే ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది.
మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు.అలాగే దక్షిణామూర్తి రూపు, దుర్గాదేవి రూపు ధరించండం, ఎనిమిది (8) శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరోజూ అలా చేయడం మంచిది.చండీెమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు దుర్గాసూక్త పారాయణం చేయించండి. అలాగే ఏదై నా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం, శుక్రవారం వెళ్లితే మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటకరాశి :
ఆదాయం: 08 వ్యయం: 02
రాజ: 07 అవమానం: 03
పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల యందు పుట్టిన వారు
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి మార్చి 29వ తేదీ నుండి అష్టమ శని ముగుస్తుంది. తొమ్మిదవ ఇంట్లోకి శని ప్రవేశిస్తున్నారు. అలాగే గురువు వ్యయంలో సంచరించుచున్నారు. కావు న ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా పరిస్థితులు గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశి వారికి 2025 మే నుండి కేతువు రెండవ ఇంట్లో, రాహువు 8వ ఇంట్లో ఉంటారు. ఈ కాలంలో ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సంవత్సర ద్వితీయార్థంలో వ్యాపార పరంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ప్రజాకర్షణ ఏర్పడుతుంది. రాజకీయపరమైన పదవులు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం చెప్పుకోదగిన స్థాయి లో జాగ్రత్తలు అవసరం అవుతాయి.సెల్ఫ్ డైవిం గ్, స్విమ్మింగ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తిత్వం చేయకండి. డాక్యుమెంట్స్ పరిశీలించేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోండి. ఆధ్యాత్నికమైన కార్యక్రమాలకు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇందువల్ల మన:శాంతి లభిస్తుంది. ఆరోగ్య పరమైన విషయాలలో నిర్ల క్ష్యం చేయకండి. గురువు వ్యయంలో సంచరించడం వల్ల ఈరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటాయి. నిలబెట్టుకోవాలి అంతే
వృత్తిఉద్యోగాల పరంగా సంవత్సర ప్రథమార్ధంలో పురోగతి సాధారణంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో మంచి అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ధన నష్టం, కుటుంబంలో మనస్పర్థలు, భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారు అవసరమైతే తప్పా ఉద్యోగ మార్పు చేయకండి. అధిక శ్రమ ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇల్లు కొనాలని ఒత్తిడి పెరుగుతుంది. అయితే కొనేటప్పుడు ఫైనాన్సియల్‌గా అన్ని చూసుకుని వెళ్ళడం మంచిది. లేకపోతే అప్పులపాలు కావలసి ఉంటుంది. బంధు మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించండి. క్రెడిట్ కార్డు, లోన్స్ విషయంలో తొందరపాటు వద్దు. ఈ రాశి వారు లక్ష్మీ గణపతి ెమం చేయించుకోవడం, లక్ష్మీ గణపతి డాలర్ వేసుకోవడం మంచిది.
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యమైనా మంచి సంబంధం కుదురుతుంది. అయితే జాతక పరిశీలన చేసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. స్తోమతకి మించి వివాహం ఘనంగా నిర్వహిస్తారు. అయితే మూడు నెలలకే వివాహ బంధం విడిపోవడం, లేదా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఇది అందరికీ కాదు, కొంత మందికి మాత్రమే. ద్వితీయంలో కేతువు సంచార ప్రభావం వల్ల కుటుంబమే కాదు, భాగస్వామి కూడా వర్తిస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కళా సాహిత్య, సాంసృ్కతిక రంగాలలో గుర్తింపు లభిస్తుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలికంగా అనుకుంటున్న పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
విద్యార్థినీ, విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు, విజయప్రాప్తి కలుగుతుంది. పోటీ పరీక్షలలో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. వైద్య విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. పరీక్ష బాగా రాసినా ఫలితం రాకపోవడం మనోవేదనకు గురి కాకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ద్వితీయార్థంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి రోజు గణపతి స్తోత్రం పఠించండి. మేధాదక్షిణా మూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. కోపాన్ని తగ్గించుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అనుకూలమని చెప్పవచ్చు. వీసా, గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సం వత్సర ద్వితీయార్ధంలో ఉద్యోగంలో స్థాన చల నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదనపు బా ధ్యతలు, ప్రమోషన్‌లు లభించవచ్చు. వృత్తిఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారికి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. చెప్పు డు మాటలు నమ్మవద్దు. ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా నిజాలు నిర్ధారించు కోండి. మీకు మేలు జరుగుతుంది. అపార్థాలు, అపోహాలకు దూరం గా ఉండి వాస్తవాలకు దగ్గరగా గ్రహించడానికి ప్రయత్నించండి. మీకు మేలు జరుగుతుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభా లు సంతృప్తికరంగానే ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్, రియల్ ఏస్టేట్, వ వ్యాపారం, ఫ్యాషన్ జ్యువెలరీ, బ్యాంకింగ్ సెక్టార్‌లో బాగా రాణిస్తా రు. అష్టమ రాహు సంచారం వలన ఆరోగ్య పరమైన జాగ్రత్తలు, వ్యాపారంలో ఇబ్బందులు లేని వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. కీడెంచి మేలు అనే సామెత ఉన్నట్టు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం కాలభైరవ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితా లు అందుకోగలరు. అలాగే శివస్తోత్రం కూ డా ప్రతి సోమవారం పఠించాలి. అదే విధంగా ప్రతి సోమవారం రుద్రాభిషేకం అవకాశం లేని యెడ ల మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించడం మంచిదని చెప్పదగిన సూచన. ఎనిమిది (8) శుక్ర వారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరో జూ అలా చేయడం ఎంతో మంచిది. తద్వారా ఏదోవిధంగా ఆదాయానికి దారులు ఏర్పడుతాయి. రుద్ర పాశుపత ెమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళెటప్పుడు సోమవారం, శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.
సింహరాశి :
ఆదాయం: 11 వ్యయం: 11
రాజ: 03 అవమానం: 06
మఘ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4 పాదములు, ఉత్తర 1వ పాదముల యందు పుట్టిన వారు.
సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. జీవితాశయం నెరవేరుతుంది. కుటుంబ పురోగతి కోసం, వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. వృత్తిఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. శని కుంభం నుండి మీన రాశిలో ప్రవేశిస్తున్నాడు. సింహ రాశి నుండి మీన రాశి ఎనిమిదవ స్థానం అవుతుంది. కావున మార్చి 29వ తేదీ నుండి సింహ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. కావున చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరమవుతాయి.
నూతన పరిచయాలకు ప్రాధాన్యత ఇస్తా రు. ఆడంబరానికి ప్రాధాన్యాన్నిస్తారు. దీర్ఘకాలికంగా మిమ్ములను ఆశ్రయించి ఉన్నవారు కొం త మంది దూరంగా తప్పుకుంటారు. ఇందుకు కారణాలు సంపూర్ణంగా మీకు తెలియవు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యయ ధన సూచన కనిపిస్తోంది.అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. అనాలోచిత ఖర్చులు అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావు. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి, కాళ్ళకు, గ్యాస్ట్రిక్, కాలేయం సంబంధించి ఆరోగ్య పరమైన సమస్యలు రావచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి.
సంతాన పురోగతి బాగుంటుంది. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. అయితే సంతాన వివాహానికి సంబంధించి ఇబ్బందలు ఉంటా యి. వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలి. విడాకులు తీసుకునే వారు ఎక్కువతారు. సమన్వయ లోపం వల్ల విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. (ఇది అందరికీ కాదు కొంత మందికి మాత్రమే). ఎవరి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని వారి భవిష్యత్తుని తెలుసుకుని తగిన పరిష్కారాలు పాఠించడం మంచిది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా ఒకరినొకరు అర్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మధ్యవర్తి వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా వివా హ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. అనవసరమైన గొప్పలకు, ఖర్చులకు దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి.
మే 15 నుండి ఏకాదశంలో గురు సంచా రం వలన వృత్తిఉద్యోగాలకు సంబంధించిన విషయాలు సంవత్సర ప్రథమార్ధంలో కన్నా ద్వితీయార్ధంలో బాగుంటాయి. ఉద్యోగంలో మార్పు లు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు కలసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలం ఉంది. మంచి ెదాను సంపాదిస్తారు. ఇల్లు అమ్మి ఇంకో చోట స్థ లం లేదా ఫ్లాట్ కొంటారు.
విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యాయోగం ఉంది. ఉద్యోగము, గ్రీన్ కార్డు లభిస్తాయి. పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినకపోవడం వలన నష్టపోతారు. వైద్య విద్య, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్‌వేర్ రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది. అయితే ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది. సహనం ఓర్పు ఉండాలి. అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలి అనుకున్నా అవి నిదానంగా సాగుతాయి. కాలభైరవ రూపు ధరించాలి. మంగళ వారం, శనివారం ఆంజనేయస్వామి వారికి ఆకు పూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌లు లభించవచ్చు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తిఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కాస్త ఊరట లభిస్తుంది. భాగస్వామితో విభేదాలు తప్పక పోవచ్చు. జాగ్ర త్త వహించండి. సొంత ఇంటి కల నెరవేరుతుం ది. అందరూ మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో చేయాలని చూస్తారు. అహంకారం ఎక్కువ ఎవరిని పట్టించుకోరు అనే పేరు వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పిన మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. బంధువులతో కలసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలో చురుకుగా పాల్గొంటారు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారంలో భాగస్వామి కాకుండా స్వంతంగా చేస్తే మంచిది. ఇతరులతో అంతగా మీకు కలిసి రాదు. ఏదైనా భాగస్వామితో చేయవలసి వస్తే ఇంట్లో వారి పేరు కలుపుకోండి. మీరు చేసే వ్యాపారం వల్ల అవతలివారికి లాభం ఉంటుంది. తప్పా మీకు మాత్రం అంత లాభం ఉండదు కాబట్టి ఇంట్లో వారి పేరు పెట్టి బిజినెస్ చేయడం మంచిది. ఫ్యాషన్ డిజైనింగ్, రియల్ ఏస్టేట్, వవ్యాపారం, ఫ్యాషన్ జ్యువెలరీ, బ్యాంకింగ్ సెక్టార్‌లో బాగా రాణిస్తారు. అష్టమశని సంచారం వల్ల ఆరోగ్య పరంమైన జాగ్రత్తలు, వ్యాపారంలో ఇబ్బందులు లేని వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా మొదటికే మో సం అవుతుంది. కావున ప్రతి పనిలో, విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. నరదిష్ఠి అధికంగా ఉంటుంది. ప్రతి నిత్యం నాగసింధూరం ధరించండి. కొంత నరదిష్ఠి నుండిఉపశమనం ఉంటుంది. అలాగనే ప్రతిరోజూ శని స్తోత్రం పఠించడం, అఘోర పాశుపత మంత్రం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సం వత్సరం బాగుంటుంది. ఈ రాశివారు కాలభైరవ స్తోత్రం పఠించడం, అఘోర పాశుపత ెమం, సు బ్రహ్మణ్య పాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి సోమవారం రుద్రాభిషే కం లేదా వీలు పడకుంటే మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఎనిమిది (8) శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరోజు చేయడం మంచిది. ఇంట్లో ఏదైనా ఒక రోజు సుం దరకాండ పారాయణం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం, శుక్రవారం వెళ్ళండి.
కన్యారాశి :
ఆదాయం: 14 వ్యయం: 02
రాజ: 06 అవమానం: 06
ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు, చిత్త 1,2 పాదముల యందు పుట్టినవారు.
కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కన్యారాశి వారికి శని భగవానుడు 2025 మార్చి 29వ తేదీ వరకు 6వ ఇంట్లో ఉంటారు. 29వ తేదీ తదుపరి 6వ ఇంటి నుండి 7వ ఇంట్లోకి రాబోతున్నాడు. ఇదొక రకంగా మంచిదే అని చెప్పవచ్చు. కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. మరియు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.
2025 మే 30వ తేదీన రాహువు కుంభ రాశిలో, సింహ రాశిలో కేతువు ఉంటారు. ఈ రెండు గ్రహాల సంచారం మీకు శుభప్రదంగా చె ప్పవచ్చు. సమాజంలో గుడ్‌విల్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజ యం సాధిస్తారు. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూల కాలం అని చెప్పవ చ్చు. మీరు అనుకున్న దానిలోనే మంచి సీట్ లభిస్తుంది. డెంల్, మెటనరీ, కాస్మొటిక్స్ వారికి మంచి అవకాశాలు వస్తాయి. హోమియో వైద్యా నికి ఆదరణ లభిస్తుంది. క్రీడా సంబంధమైన వి షయాలలో కొంత మానసిక సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగానికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వస్తుంది. స్త్రీ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. గ్రీన్ కార్డ్, హెచ్1బి లభిస్తుంది. పి.హెచ్.డి కోర్సులు పూర్తి చేస్తారు. కార్యాలయంలో ఉద్యోగుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఒం ట్లో ఓపిక ఉన్నప్పుడే సంపాదించాలి. అని ని ర్ణయించు కుంటారు. ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. ఓం నమ:శివాయ వత్తులతో దీపారా ధన చేయడం అలాగే ప్రతి నిత్యం లక్ష్మీ అష్టో త్తరం పఠిస్తే మేలు జరుగుతుంది.
దేవతలకు గురువు అయిన గురువు 2025 మే 14వ తేదీ వరకు 9వ ఇంటిలో అంటే వృషభ రాశిలో సంచరిస్తారు. 2025 మే 14వ తేదీన 10వ ఇంటిలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు గురువు 11వ ఇంట్లో సంచరిస్తా రు. కాబట్టిగురువు మీకు సంతృప్తికరమైన ఫ లితాలను అందజేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
విద్యార్ధిని విద్యార్థులకు విదేశీయాన సంబం ధమైన విషయాలు విదేశాలలో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు మొదలైనవి అనుకూలిస్తాయి. వైద్య విద్య అభ్యసించే వారికి బాగుంటుంది. అన్ని మనకే తెలుసు అని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బందులు ఏ ర్పడతాయి. టెక్నికల్, మెడికల్ సి.ఏ వారికి అ నుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు.
ప్రేమ వివాహ సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాతక పరిశీలన చేసుకు ని ముందుకు వెళ్ళడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. భార్యభర్తల మధ్య వి భేదాలు రాకుండా చూసుకోవాలి. సంతాన సం బంధమైన విషయంలో ప్రేమ విషయంలో జాగ్ర త్తలు తీసుకోవాలి. ఏది చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని మీరే దగ్గరగా ఉండి చూసు కోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొడ తాయి. పెద్దవారు చెప్పి విషయాలు గ్రహించి ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందులు ఎ దురైనా వారు మీకు అండగా ఉంటారు. వారితొ విభేదిస్తే నష్టపోయేది మీరే అవుతారు.
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహానికి ముందు ఆస్తిపాస్తులే కాకుండా వధూవరుల జాతక ప రిశీలన తప్పకుండా చేసుకుని ముందుకు వెళ్ళండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయం లో డాక్టర్స్ సలహాలు, సూచనలు పాటించండి.
మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత శుభకార్యాలను సానుకూల పరుచుకోగలుగుతారు. ఆదాయాన్ని మించిన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అందువలన మీరు కొంత మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆ ఖర్చులు పెద్దగా మీ కళ్ళకి కనిపించవు.
నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. సంఘంలో గౌరవ మ ర్యాదలు పెంపొందుతాయి. కుటుంబ సమస్యలు కొంత కాలం చికాకు పరచినా చివరకు సానుకూల పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిఉద్యోగాలలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. వృత్తిఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వా రికి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి 2025 మే తరువాత ప్ర యత్నాలు చేయండి.
సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. సంతాన ప్రాప్తి గోచరిస్తున్నది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో తొందరపడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వె ళ్ళండి. తెలిసిన వారి నుండి సంబంధం వస్తుంది. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం శివ స్తోత్రం, విష్ణు అష్టోత్తరం పఠిస్తే మ రిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే ఏ కముఖి రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అదే విధంగా ఎనిమిది (8) శనివారాలు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి అర్చన చేయించండి. మహాలక్ష్మీ ెమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక మంచి రోజు సుందరకాండ పారాయణం చేయించండి. అలాగే ఏదైనా పనిమీద వెళ్ళేటప్పుడు గురువారం, శనివారం వెళ్ళండి మంచి ఫలితాలుంటాయి.
తులారాశి :
ఆదాయం: 11 వ్యయం: 05
రాజ: 03 అవమానం: 03
తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. తులారాశి వారికి 2025 మార్చి 29వ తేదీ నుండి శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరిస్తాడు. అందువల్ల అనుకూలమైన ఫలితాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి. అనుకూలమైన శనిగ్రహ ప్రభావం వలన ఏ పని చేపట్టినా తిరుగులేని విధంగా ఉంటుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. పట్టిందల్లా ంగారం అవుతుంది.
ఈ సంవత్సరం రాహువు 5వ ఇంట్లో కేతువు 11వ ఇంట్లో ఉంటారు. కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన విధంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా గే గురువు అష్టమం నుండి భాగ్యంలో సంచారం వలన అనుకున్న పనులు పూర్తి అవడం, శుభకార్యాలు చేయడం, అప్పులు తీర్చడం వంటివి జరుగుతాయి. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మం చి ఉద్యోగం లభిస్తుంది. నూతన గృహం కొనుగోళ్ళు చేస్తారు. వాహన యోగం ఉంది. ఋణా లు చేసి వస్తు, వాహనాలు, గృహాలు తీసుకునే వారికి అనుకూల కాలం. క్రెడిట్ కార్డు విషయం లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక పరమైన సమస్యల నుండి బయటకు రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది.
2025 సంవత్సర ద్వితీయార్ధంలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తారు. అంటే రెట్రోగేట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. కావున ఈ సమయంలో తులారాశి వారు ఆరోగ్య పరంగా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గురువు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి గత సంవత్సరం అంటే 2024 కంటే కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కూ డా మంచి ఫలితాలు ఉంటాయి. కాకుంటే కీళ్ళ సంబంధమైన అనారోగ్య బాధలు బాధిస్తాయి. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి.
వ్యాపారస్తులకు 2025 మే 15 తేదీ తరువాత గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడు. ఈ కాలంలో వ్యాపార పరమైన విషయాలలో లాభాలు, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. అప్పులు తీరుస్తారు. నష్టాల్లో ఉన్న వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దినదినాభివృద్ధి చెందుతారు. కాకుంటే ఏమి చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామి వ్యాపారాలు కలసి రావు. మీకు మీ రుగా చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
ఈ సంవత్సర ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం మీరు ఆశించిన దానికంటే కూడా చాలా బాగుంటుంది. వచ్చిన దాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అత్యాశకు పోయి డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు. అనవసరమైన పెట్టుబడులు చేయరాదు.
విద్యార్ధినీ, విద్యార్థులు బాగా రాణిస్తారు. మెరిట్ మార్కులు సాధిస్తారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య పట్ల కాస్త బద్ధకం వస్తుంది. బద్ధకాన్ని వదిలి ఎప్పటికప్పుడు ఏరోజుది ఆ రోజు పూర్తి చేసేలా చదవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. దుర వ్యసనాలకు దూరంగా ఉండాలి. అందరిని నమ్మవద్దు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటే మేలు చేకూరుతుంది. అలాకాదని అనుకుంటే కొన్ని ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. అన్ని మనకే తెలుసు అనే విధానానికి స్వస్తి పలకాలి. మనమే అనుకుంటే మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు అని గుర్తు పెట్టుకోవాలి. ఏది ఏమైనా విద్య పరంగా అన్ని విధాలుగా బాగుంది. మీరు కాస్త శ్రద్దపెడితే మీరు కోరుకున్న జీవితం మీకు తొందరలో పొందుతారు.
ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తు న్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎట్టకేలకు మంచి సంబంధం కుదిరింది అని సంతోష పడతారు. మీ సంతోషాన్ని పదికాలాలు ఉండాలి అంటే ముందుగా మీ ఇరువురి జాతక పరిశీలన చేసుకుని వివాహ పరంగా ముందుకు వెళ్ళండి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఎంతో కా లంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం కలుగుతుంది. సం తానం కలిగే విషయంలో మీరు తగిన జాగ్రత్త లు, డాక్టర్ సలహాలు, సూచనలు పాటించండి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కల నెరవేరు తుంది. ఇది మీ కొన్ని సంవత్సరాల కల. నూతన గృహం, వాహన యోగం గోచరిస్తున్నది. స్థిరాస్తులు కలసి వస్తా యి. చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగం ల భిస్తుంది. అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ధనం ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వలన లాభపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుం బం కోసం శ్రమిస్తారు. వ్యక్తిగత హామీలు కాని సంతకాలు కాని చేయ్యకండి. కోర్టు తీర్పులు మీ కు అనుకూలంగా వస్తాయి.
కీర్తి ప్రతిష్టలను కాపాడు కోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం ల భిస్తుంది. ప్రభుత్వం నుండి అనుకూల ఉత్తర్వులు లభిస్తాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను ఉన్నత స్థితిని సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి పరంగా గణిత వేత్తలకు, లెక్చరెర్లకు, పరిశోధన విభాగం వారికిమం చి ఉన్నతి సాధిస్తారు. బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు, విద్యా సంబంధమైన లోన్లు, గృహ ని ర్మాణపరమైన ఋణాలు మంజూరు అవుతాయి.
ఈ రాశి వారు ఈ సంవత్సరం శివాభిషేకం ప్రతి నెల చేయించడం మంచిదని చెప్పదగిన సూ చన. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం, పిల్లలకు మేధాదక్షిణామూర్తి రూపు వేయడం మంచిది. ప్రతి రోజు ఇంట్లో విష్ణు సహస్ర నామాలు వింటే మంచి ఫలితాలు ఉంటాయి. రుద్ర ెమం చేయించండం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు (అంటే మీ పెళ్ళి రోజు, పిల్లల పుట్టిన రోజు అలా ఏదైనా ఒకటి నిర్ణయించుకుని) సుందరకాండ పారాయణం చేయించండి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం, శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.
వృశ్చికరాశి :
ఆదాయం: 02 వ్యయం: 14
రాజ: 05 అవమానం: 02
విశాఖ 4వ పాదము, అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు.
వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారి కి అర్ధాష్టమ శని పూర్తవుతుంది.శని చతుర భా వంలో నుండి పంచమ భావంలో ప్రవేశిస్తారు. అ లాగే మే 15 నుండి గురువు సప్తమ స్థానం నుండి అష్టమంలో ప్రవేశం. మే 19 నుండి రాహుకేతువు లు చతుర్థ దశమ స్థానంలో ప్రవేశం జరుగును.
2025 మే 15 వరకు బాగున్నా ,తరువాత ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం పోవడం, ఇంట్లో ఏదో ఖర్చులు రావడం, సంపాదించిన ధనం ఎక్కువ ఖర్చు అవడం జరుగును. కోర్టు సంబంధించినవి ఇబ్బందులు ఉంటాయి. సంతానం గురించి కొంత ఆందోళన ఉంటుంది. పని చేసేచోట ఆటంకాలు అపనిందలు వస్తాయి. అనుకున్న పనులు ఆగిపోవడం జరుగుతుంది. అక్టోబర్ 2025 నుండి వీరికి కొంత ఉపశమనం కలుగుతుంది. అధైర్యపడొద్దు, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలేయం, కడుపు సంబంధించి ఇబ్బందిలు ఉంటాయి. దశమస్థాన కేతు సంచారం వల్ల ఉద్యోగంలో ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణం, సంఘర్షణలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. మిమ్మల్ని వాడుకుని అవసరం తీరాక వదిలేయడం జరుగుతుంది. ఎప్పటి నుండో మిమ్మల్ని ఆదరిస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మడం వలన కూడా పాతవారిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి అహంకార పూరితమైన వ్యవహార శైలిలో కూడా మీ దగ్గరి ఆప్తులను వదులు కోవడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రం ఎక్కువగా పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన.ఇల్లు కొందామన్నా, అమ్మాలన్నా ఆటంకాలు ఎదురవుతాయి. అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి అన్నట్టు అవుతుంది. ఏదో విధంగా జీవితంలో స్థిరత్వం పొందాలని మీ ప్రయత్నాలు కొంత వరకు ఫలితాలు ఇస్తాయి. అయినా మీరు ఆశించినంతగా బ్ధి పొందలేరు.
వ్యాపారస్తులకు వ్యాపారం ప్రథమార్ధం బాగున్నా ద్వితీయార్ధంలో సానుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. వ్యాపారంలో నష్టం, భాగస్వాముల మధ్య విభేదాలు రావడం, ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతాయి. అక్టోబర్ నుండి కొంత మేర లాభాలు బాగుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అదృష్టం కలసి వస్తుంది. (కొంత మందికి మాత్రమే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ అనేది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గమనించగలరు.) ఎప్పుడో పె ట్టిన పెట్టుబడులు మంచి లాభాల్లో ఉంటాయి. నూతన అవకాశాలు కలిసివస్తాయి.
ఎంతో కాలంగా వివాహ ప్రయత్నా లు చేస్తున్న వారికి మంచి సంబంధం ఆలస్యంగా అయినా కుదురుతుంది. వచ్చిన సంబంధాలు కొన్ని నచ్చాయని కొన్ని నచ్చ లేదని వాయిదా వేస్తారు. మంచి సంబంధం కుదిరితే ఇంకా మం చి సంబంధం వస్తుంది అని పక్కన పెడతారు. సంతాన విషయంలో అశ్రద్ద చేస్తారు. మీకు చెప్పకుండా వివాహం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుం ది. (ఇది కొంత మందికి మాత్రమే అందరికీ కాదని గమనించగలరు.) సంతానం కోసం ప్రయత్నిస్తు న్న వారికి ఆలస్యమైనా సంతానం కలుగుతుంది. మానసిక ఆనందానికి అవధులు ఉండవు.
విందు వినోద కార్యక్రమాలలో ఎప్పుడూ మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో కోర్టు పరమైన వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి.
విద్యార్ధిని, విద్యార్ధులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలి. చేసే పనిలో ఆటంకాలు, బ్యాక్‌లాక్స్ ఉండే పరిస్థితి గోచరిస్తున్నది. శ్రద్ద వహించాలి. లేదంటే ఇబ్బందులు నలుగురిలో చిన్నతనం పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. చదివే చదవు ఏదైనా కూడా శ్రద్ద వహించి చదవాలి. అనాలోచిత ఆలోచనలు వలన నష్టం వాటిల్లుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టు వచ్చి చేజారిపోవడం జరుగుతుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీసా, గ్రీన్ కార్డు హెచ్1బి కాస్త ఆలస్యంగా వస్తాయి. . అలాగే మగపిల్లలు ఏకముఖి రుద్రాక్ష ధరించండి మంచి ఫలితాలుంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృతివ్యాపారాల పరంగా పథమార్ధంలో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. అలాగే సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తిఉద్యోగాలలో పెను మార్పులు సంభవించవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఏమిటి ఈ పరిస్థితి ఇలా ఎందుకు జరుగుతోంది ఎప్పుడూ ఇలా బాధపడలేదు అనే భావన కలుగుతుంది. అయితే ఇది తాత్కాలికమే, కొంత ఓర్పు, సహనం పాటించండం మంచిది. జీవితభాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అక్టోబర్ నుండి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకశాలు ఉన్నాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చ వద్దు.
విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం కాని వినడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం బాగుంటుంది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం, ఎనిమిది (8) శనివారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ లేదా నెలకు ఒక సారి చేయించడం అదే విధంగా సుహ్మ్రణ్య పాశుపత ెమం చేయించడం మంచిదని చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒక రోజు చంఢీ ెమం చేయించుకోవడం చాలా ఉపయుక్తమైనది. అలాగనే ప్రతిరోజు గుగ్గిలంతో ఇంట్లో ధూపం వేయడం మంచిది. కుదరని పక్షంలో మంగళవారం, శుక్రవారం నాడు వేసినా నరదిష్ఠి నుండి కొంత ఉపశమనం కలుగుతుంది.అలాగే ఏదైనా పనిమీద వెళ్ళేటప్పుడు శుక్ర వారం, సోమవారం నాడు వెళ్ళండి మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనుస్సురాశి :
ఆదాయం: 05 వ్యయం: 05
రాజ: 01 అవమానం: 05
మూల 1,2,3,4 పాదములు, పూర్వా షాఢ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదముల యందు పుట్టినవారు ధనుస్సు రాశికి చెందినవారు.
ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ధనస్సు రాశి వారికి ఈ సంవత్స రం ప్రథమార్ధంలో అర్థాష్టమ శని ప్రారంభం అవుతుంది. ధనస్సు రాశి నుండి మీన రాశి నాల్గవ స్థానం అవుతుంది. 2025 మార్చి 29న శని భగవానుడు కుంభం నుండి మీన రాశిలో ప్రవేశం జరగుతుంది. శని నాల్గవ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని నడుస్తున్నట్లు. కావున ధనస్సు రాశి వా రు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం ధనస్సు రాశి వారిపై ఉన్నప్పటికీ అనుకూలమైన గురు గ్రహ కారణంగా మీకు చాలా శుభ ఫలితాలు ఉండ బోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మరియు విదేశీయానం బాగా కలిసివస్తుంది. ఆదాయం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. అధైర్యపడవద్దు.
ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఉండే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నిదానంగా సానుకూలంగా ప్రశాంతంగా ఉండి సమస్యలని పరిష్కరించండి. ట్రాన్స్‌ఫర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అయినా కూడా ట్రాన్స్‌ఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారికి ఉద్యోగం పోవడం, లేదా బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
సోదరీ సోదరుల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో స్ఠలం కాని గృహం కాని సేల్ చేద్దామనుకున్న వారికి మే తదుపరి వీలుపడుతుంది. కష్టేఫలి అన్నట్టుగా ఉంటుంది. అక్టోబర్ నుండి కొంత మేర సానుకూల ఫలితాలు బాగుంటాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందు అడుగు వేయండి. ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు, అఘోర పాశుపత ెమం చేయించండం చెప్పదగిన సూచన.
కుటుంబ బాధ్యతలు, వివాహాది శుభకార్యాల వంటివి నెరవేరుస్తారు. విదేశీ యానం చేస్తారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారి కోసం ఎక్కువ శ్రమ తీసుకుంటారు. వారికి కావాల్సినవి సమయానుకూలంగా సమకూరుస్తారు.
నూతన గృహ యోగం, వాహన యోగం గోచరిస్తున్నది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి. వైద్యవృత్తి, ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, చార్టెడ్ అకౌంట్స్, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, ప్రోఫెసర్స్, మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నవారికి మే నుండి బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పులు, పాదాలకు సంబంధించిన నొప్పులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పెట్టే స్థితి గోచరిస్తున్నది. సరైన సమయంలో వైద్యం చేయించుకోవడం మంచిది.
విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. అధికారం కలిగినటువంటి ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, వైద్య విద్య, ఎవ్‌ు.బి.ఏ ఫైనాన్స్ సెక్టార్స్, సాఫ్ట్‌వేర్ వారికి అనుకూలమని చెప్పవచ్చు. విదేశాలలో ఉన్నత విద్య ను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తా యి. మొత్తం మీద విదేశీయానం లాభదాయకం గా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వా రు ప్రయత్నాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలిక కా ర్యక్రమాల వలన మనోబలం ఏర్పడుతుంది. బం ధుమిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు.
విదేశాలలో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. విదేశాలలో ఉండి పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రీన్‌కార్డు, పి.ఆర్., హెచ్1బి వీసా లభిస్తాయి. వైద్యరంగంలో ఉన్న వారికి ముఖ్యంగా డాక్టర్లకు ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది. హస్తవాసి మంచిదని ప్రఖ్యాతి లభిస్తుంది. ఇదేవిధంగా ప్రతిరంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి, ఇదంతా శనిభగవానుని అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల ఇలాంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిఉద్యోగాల పరంగా ఉన్నత స్థానం లభిస్తుంది. ప్రభుత్వ సన్మానం, అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి మే 2025 తరువాత ప్రయత్నాలు చేయండి. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ వారికి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ జ్యువెలరీ, సినీ ఇండస్ట్రీ వారికి ఈ సంవత్సరం బాగుంది. ప్రభుత్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గ్రీన్‌కార్డు, హెచ్1బి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం ఒక వ్యాపారంలా మారింది. పెళ్ళి చేసుకోవడం, తరువాత వదిలి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకోవడం చూస్తున్నాము. కాబట్టి వివాహ విషయంలో కుటుంబ పరంగా విచారించి, జాతక పరిశీలన చేసుకొని నిర్ణయాలు తీస్కోండి. వివాహ విషయంలో తొందరపడకుండా జాతకపరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. తెలిసిన వాళ్ళ సంబంధం వచ్చిందని అంతా బాగుంటుందని కా కుండా పరిశీలన చేసుకుని ముందుకు వె ళ్ళడం చెప్పదగిన సూచన. తరువాత ఇబ్బంది ప డేకంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతికష్టం మీద సంబంధం కుదురుతుంది. బంధువులలో స్త్రీల మధ్య విభేదాలు వస్తాయి, అవి పెద్దవై అందరినీ చికాకు పరుస్తాయి. చాకచక్యంగా ఈ సమస్యలను పరిష్కరించి ఆపద్బాంధవుడని అనిపించుకుంటారు. పునర్వివాహ ప్రయత్నాలు చేయువారికి సంవత్సర ద్వితీయార్థం బాగుంది. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి, కాపురాలు మాత్రం బాగుండవు.వివాహం చేసుకున్న కొద్ది రోజులకే భేదాభి ప్రాయాలతో విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులను చూసి నైరాశ్యం ఏర్పడుతుం ది. వాళ్ళను కలిపే ప్రయత్నాలు ఫలించవు. పెద్ద లు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఉత్తమం అని గ్రహిస్తారు. ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలను మార్చుకుంటారు.
మొత్తం మీద సంవత్సరం ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం శనిస్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు.అలాగే కాలభైరవ రూపు, దుర్గాదేవి రూపు ధరించడం, 8 శని వారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అఘోర పాశుపత ెమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతి రోజు ఓం నమ: శివాయ వత్తులతో దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం కాని చేయండి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం, శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.
మకరరాశి :
ఆదాయం: 08 వ్యయం: 14
రాజ: 04 అవమానం: 05
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2 పాదముల యందు పుట్టినవారు.
మకరరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మకరరాశి వారికి శని భగవానుడు కుంభరాశి నుండి మీన రాశి ప్రవేశించారు. ఏలిననాటి శని పూర్తవుతుంది. గత ఏడున్నర సంవత్సరాల నుండి ఏలిననాటి శని వల్ల మీరు పడుతున్న కష్టాలకు విముక్తి ఈ సంవత్సరం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఘననీయంగా మెరుగుపడుతుంది. ఒక రకంగా మకర రాశి వారికి మంచి రోజులుగా చెప్పవచ్చు. తృతీయ శని సంచారం వల్ల కొన్ని ఉపయోగకరమైన పనులు చేస్తారు. దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఇంతకు ముందు కంటే కూడా చాలా విషయాలలో విజయాలు సాధిస్తారు.
రాహువు ద్వితీయంలో కేతువు అష్టమంలో ఉన్న కారణం చేత చిన్నచిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అష్టమ కేతువు అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో గురువు మే 15 పంచమం నుండి సష్టమంలో ప్రవేశిస్తారు కాబట్టి ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాని ఎక్కువగా పొదుపు చేయలేకపోతారు. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్తారు. ప్రమోషన్ లేదా నూతన ఉద్యోగం లభించవచ్చు. వైద్య, సాఫ్ట్‌వేర్, రియల్ ఎస్టేట్, రంగాలలో, మరియు పోటీ పరీక్షలలో మంచి విజయాలు సిద్ధిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే బందీ నుండి విముక్తి పొందినట్లుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార పరమైన విషయాలు, వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి.
విద్యార్ధిని విధ్యార్ధులకు విద్యా పరంగా అభివృద్ధి బాగున్నప్పటికీ ఇతరులతో పోల్చి చూసుకొన్నప్పుడు కొంత లోటుగా అనిపిస్తుంది. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మీ కృషిని సాగించటమే చెప్పదగిన సూచన. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశీ విద్య, వైద్య విద్య, టెక్నికల్ సంబంధించిన విద్య బాగుంటుంది. మీకున్న తెలివి తేటలకు అందరు ముగ్దులవుతారు. విదేశాలకు వెళ్ళాలన్న మీ కల నెరవేరుతుంది. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. ఉద్యోగంకోసం ప్రయత్నిస్తున్నవారికి ఉద్యోగం లభిస్తుంది. కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎంత ఇబ్బంది పడ్డా గమ్యాన్ని చేరుకుంటారు.
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించ గలుగుతారు. జీవిత భాగస్వామి వల్ల కొన్ని కార్యక్రమాలు కలసి వస్తాయి. నూతన గృహం కొనుగోళ్ళు చేస్తారు. సోదరీ సోదరుల మధ్య బంధం పెరుగుతుంది. ఎప్పటి నుండో ఉన్న ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. సంతాన సంబంధించిన విషయాలు బాగున్నాయి. వారి చదువులో ఉత్తీర్ణతను చూసి మురిసిపోతారు. ఒక్కోసారి మీ మాటలు వినటం లేదు అని ఆందోళనకు గురి అవుతారు. అయినా వారు మీకు మానసిక ఆనందం కలిగించే విధంగా ఉంటారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య పరంగా శ్రద్ద మాత్రం తప్పక అవసరం అవుతాయి. సంవత్స ద్వితీయార్ధంలో ఉద్యోగ పరంగా స్వల్పమైన ఒడిదుడుకులు రావచ్చు. స్థాన చలనానికి అవకాశం ఉంది. అక్టోబర్ నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. నైతిక బాధ్యతలను పూర్తి చేయడానికి, తల్లిదండ్రులను సంతోష పెట్టడానికి మీరు చేసే పనులు కృషి చెప్పుకోదగిన ఫలితాలను ఇస్తాయి. ఏది ఏమైనప్పటికీ మీ శక్తి సామార్ధ్యాలకు తగినటువంటి స్థాయి లభిస్తుంది. ప్రజా సంబంధాలు బాగుంటాయి. శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించి మంచి ఫలితాలను రాబడతారు.
మీ కుటుంబ సభ్యులలో కొంత వరకు అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా కొంత వరకు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మనోవేదనకు మందు లేదు. మనోవేదనకు గురికాకుండా ఉండడం అవసరం. చర్మ సంబంధ వ్యాధులు హిమోగ్లోబిన్, రక్త సంబంధిత వ్యాధులతో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో అశాంతికి కారణమైన వ్యక్తులను గుర్తించి కూడా మీరు ఏమీ చేయలేరు. మీకులేని ఉద్దేశ్యాలను మీకు ఆపాదించి రక్త సంబంధీకులకు, సన్నిహితులకు అందరికీ దూరం చేయాలని మీ శత్రుకూటమి విశేష ప్రయత్నాలు చేస్తుంది. జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, వైరాగ్యం, గతస్మృతులు మీ మనోవేదనకు కారణం అవుతాయి, అన్నీ ఉండి అనుభవించలేక పోతున్నామనే భావన మీ మనస్సుని కలవరపరుస్తుంది. పుష్కలంగా డబ్బు లేకపోయినా గతంలోనే బాగుందనే భావన పదేపదే అనిపిస్తుంది. కర్కశం అనే కాలానికి అందరూ ఒక్కటే అన్న భావన మీకు మింగుడు పడదు. గతం అనే సముద్రంలో పడిపోయిన(గతించిన)ఆత్మీయుల గురించి ఇంకా బాధపడటం మీ మానసిక బలహీనతలను సూచిస్తుంది. మీ ముందు ఉన్న బాధ్యతలను, కఠినమైన సవాళ్ళను యాంత్రికంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు, విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మొదలైనవి కలిసి వస్తాయి. స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోగలుగుతారు. సంతానం పూర్వ అభివృద్ధికి మరింత శ్రమించవలసి ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో మీసాటి వాళ్ళు మిమ్ములను అధిగమించి ముం దుకు వెళ్తున్నారనే భావన మీలో కలుగుతుంది.
మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారు ఈ ఏడాది విష్ణు సహస్రనామాలు పఠించాలి. ప్రతి శుక్రవారం విష్ణుమూర్తి ఆరాధన చేయండి. ఎనిమిది (8) శుక్రవారాలు మహాలక్ష్మీ అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం కుదిరితే ప్రతిరోజూ చేయడం మంచిది. ఇంట్లో ప్రతి నెల సత్యన్నారాయణ వ్రతం చేయించుకోవడం ఉత్తమ మం. బుధవారం, శుక్రవారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.
కుంభరాశి :
ఆదాయం: 08 వ్యయం: 14
రాజ: 07 అవమానం: 05
ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3 పాదముల యందు పుట్టినవారు.
కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం శని జన్మరాశి నుండి ద్వితీయంలో ప్రవేశిస్తారు. కుంభరాశి వారికి మూడవ దశ ఏలిననాటి శని ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది. మీరు ఏలిననాటి శని చివరి దశలో ఉన్నారు. కాబట్టి మీరు గతంలో అనుభవించిన అన్ని రకాల సమస్యల నుండి ఈ సంవత్సరం ఉపశమనం పొందగలుగుతారు. 2025 మార్చి 29 తరువాత మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ కెరీయర్, కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం సంవత్సర ద్వితీయార్ధంలో బ్రహ్మండంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
2025 మే వరకు గురువు వృషభరాశిలో ఉంటారు. ఆ తరువాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. మంచి స్థానంలోకి వెళ్ళారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు చక్కని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఘణనీయంగా పెరుగుతాయని చెప్పవచ్చు. ఉద్యోగం పోయిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సాఫ్ట్‌వేర్, మెకానికల్, సినీ కళా రంగం వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ ప్రభుత్వ సలహాదారులకు చిన్నస్థాయి ఉద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది.
2025 జూలై నుండి 2025 నవంబర్ మధ్య కాలంలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తారు. అంటే రిట్రోగేట్ ట్రాన్సెషన్ చేస్తారు. ఈ సమయంలో మాత్రం అనుకూల ఫలితాలు కొంత వరకు తగ్గుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం వలన కొంత ఆర్థిక నష్టాలు, మీ జీవిత భాగస్వామి నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను గ్రహస్థితి సూచిస్తుంది. మీరు ఏది చేసిన తప్పు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఇది కొద్దిరోజుల మాత్రమే.
జీవితం యాంత్రికంగా జరుగుతున్నట్లు తోస్తుంది. కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు అభివృద్దికి అడ్డంకిగా నిలుస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్‌కం ట్యాక్స్‌లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అందరినీ కలుపుకుని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందు వలన కీర్తి, ధనం, లభిస్తుంది. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు అయితే అది ఆచరణలో సాధ్యం కాదు.
విద్యార్ధినీ, విద్యార్ధులు బాగా రాణిస్తారు. విద్యాపరంగా విశేషించి సాంకేతిక విద్యా పరంగా చక్కగా రాణించి, పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అఖండ విద్యా యోగ్యత ఏర్పడుతుంది.
విద్యాసంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉన్నత స్థానాలలో ఉన్నవారు (ప్రొఫెసర్లు, టీచర్లు) మీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు. పరీక్షలలో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించండి, మేధోదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన
మంచి ఫలితాలు ఉంటాయి. సంతానానికి సంబ ంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కు వ అవుతుంది. మీ పరపతివల్ల వాళ్ళకు ప్రభుత్వపరమైన స్కాలర్ షిప్పులు, ప్రభుత్వ పరమైన స్కీములవల్ల లబ్ది చేకూరుతుంది. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం కోసం మీరుచేసే ప్రయత్నాలు ఫలిస్తా యి. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు.ఐ.ఐ .టి, మెడిసిన్ సీటు లభిస్తుంది. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ వల్ల లాభపడతారు. గ్రీన్ కార్డు, హె చ్1బి వీసా, పి.ఆర్ లాభిస్తాయి. ఐ.టి రంగంలో గొప్పగొప్ప విజయాలు సాధిస్తారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చెప్పుకోదగిన స్థాయిలోగొప్ప సాలరీ ఇలాంటివన్ని కూడా మీకు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్యా సంబంధమైన విషయాలు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను అధిగమిస్తారు. జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలకు అధిక ధనం వెచ్చిస్తారు. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి.
ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అక్టోబర్ నుండి కొంత మేర బాగుంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి కనిపిస్తుంది. బంధు మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. శక్తికి మించి శుభకార్యాలు చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాలకు ముందుంటారు. నాతో నేను అనే విధం గా కాకుండా నాతో నలుగురని భావిస్తారు.
ఋణాలు చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా రంగం, వైద్య రంగం, టెక్నికల్ రంగం, మెకానికల్ రంగం, నూనె వ్యాపా రం, పత్తి వ్యాపారం, సుగంధ ద్రవ్యయాలు, హోటల్ బిజినెస్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, వ, ఆభరణాల వ్యాపారం వారికి బాగుంటుంది. రైతులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురవక ఇబ్బందులకు గురి అవుతారు. అకాల వర్షాల వలన కొంత పంట నష్టం వాటిల్లుతుంది. దిగుబడి చేతికి వచ్చినా సరైనా ధరలు లభించక ఇబ్బందులు అవుతారు. సీజన్ బట్టి పంటలు వేసే రైతులకు కొంత లాభాలు వస్తాయి. జీడిమామిడి (జీడిపప్పు), మామిడి, ద్రాక్ష, సపోట ఇలాంటి పంటలు వేసే రైతులు ఆశించినంత కాకున్నా కొంత వరకు లాభాలు గడిస్తారు. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారు ఎనిమిది (8) శనివారాలు కాలభైరవుని అభిషేకాలు, ఎనిమిది (8) శనివారాలు శనీశ్వరునికి అభిషేకాలు చేయించడం మంచిదని చెప్పదగిన సూచన. అలా గే అఘోర పాశుపత హోమం చేయించాలి. కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం, పిల్లలకు మే ధాదక్షిణా మూర్తి రూపు వే యడం మంచిది. ప్రతి రోజు ఇంట్లో శని స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఏదై నా ఒక రోజు సుందరకాండ పారాయణం చేయించండి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం, శని వారం వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి.
మీనరాశి :
ఆదాయం: 05 వ్యయం: 05
రాజ: 03 అవమానం: 01
మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తు తం మీన రాశి వారికి ఏలిననాటి శని నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. 2025 మార్చి 29వ తేదీన జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది. ఈ దశలో కొంత వరకు ఇబ్బందులు ఉంటాయి. అయితే ధర్మ మార్గం, దైవారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుం టుంది. సోమరితనాన్ని పక్కన పెట్టాలి. గత రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. కర్మకారకుడైన శని నిజాయితీగా బ్రతికే వారికి శని ఎటువంటి చెడు చేయడు. ఇ తరులకు అన్యాయం చేసిన వారు, వక్ర మార్గం లో ధనం సంపాదించిన వారు, చెడు కర్మలు చేసే వారికి ఏలిననాటి శని సమయంలో మాత్రం కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. మీన రాశికి శని గురువుకి ఉన్న మిత్రత్వం వలన మిత్ర క్షేత్రంలో ఉన్న వీరికి ఏలిననాటి శని ప్రభావం తక్కువగా ఉంటుంది.
మీన రాశిలో శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు సంచరిస్తారు. అంటే 2027 జూన్ వరకు ఉంటారు. మీరు చేసిన ప్రతీ పనికి ఫలితం అనేది లేటుగా ఉంటుంది తప్పా, ఆర్థికంగా మీన రాశి వారు లాభపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. శని గ్రహ ప్రభావం మనపై ఉన్నప్పు డు న్యాయ మార్గంలోనే నడుచుకోవాలి. లేని యెడల కష్టాలు తప్పవు. కష్టాలను కొని తె చ్చుకున్నట్టే అవుతుంది. ఉద్యోగ అభివృద్ధి ఆల స్యంగా ఉంటుంది. అయితే ఆర్థికాభివృద్ధి బాగుం టుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.
క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పటి నుం డో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులు ప్రా రంభమవుతాయి. భూముల విలువ పెరుగుతుం ది. వాటిని అమ్మి అప్పు తీరుస్తారు. విదేశీ ప్ర యాణాలు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మే నుండి కొంత వరకు బాగున్నా అక్టోబర్ మరియు నవంబర్ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి బాగుంటుంది.
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. స్థిరాస్తుల కొనుగోలు, కట్టడాలు మొదలైన విషయాలు నెమ్మదిగా సా నుకూలపడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగ్యత గోచరిస్తున్నది. సంవత్సర ప్రథమార్ధంలో విశేషమైన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తోంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర ద్వితీయార్ధంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుం ది. ఆరోగ్య పరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తప్పక అవసరమవుతాయి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి. వాహనాలు నడిపే వి షయంలో మెలకువ అవసరం. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, గురువు మే 15 నుండి చతుర్థ స్థానంలో సంచారం వల్ల ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బన్స్ రావచ్చు. చదువు మీద ఏకాగ్రత లేకపోవడం వలన మీరు సాధిం చాలి అనుకున్నది సాధించలేరు. మేధా దక్షిణా మూర్తి స్తోత్రం, శని స్తోత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మేధా దక్షిణామూ ర్తి రూపు, శ్రీమేధాదక్షిణా మూర్తి ెమం చే యించడం చెప్పదగిన సూచన.
ఈరాశిలో జన్మించిన స్త్రీలకు ఏలిననాటి శని ప్రభావం ఉంటుంది.చేసే పనిలో ఆటంకాలు ఎ దురవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్రిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారికి బాగుంటుంది. ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసు కోవాలి. అధిక ఖర్చులు, జీవిత భాగస్వామి ఆ రోగ్యం పట్ల జాగ్రత్తలు, సంతాన విషయమై జా గ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన ఎంత కుదిరితే అంత చేయండి. ప్రతి మంగళవారం హనుమాన్ సింధూరంతో ఆంజనేయ స్వామికి పూజ చేయ డం చెప్పదగిన విషయం.
వ్యాపారాలు బాగుంటాయి. అయితే బిజినె స్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాము, ఫ్రెండ్స్ చెప్పారు బాగా లాభాలు వస్తాయి అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేయిస్తారు. అవి నష్టాల బా టలో ఉంటాయి. ఇంట్లో వారు వద్దు అని చెప్పినా వాళ్ళ మాటలను పక్కన పెట్టి స్టార్ట్ చేస్తారు. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా విషయా లలో విజయాన్ని సాధిస్తారు.
సంతాన సంబంధమైన విషయాలు బాగు న్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాల విషయంలో జాగ్రత్త లు తీసుకోవాలి. వివాహ విషయంలో తొందర పడకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. పక్కంటి వాళ్ళు చెప్పారనో, తెలిసిన వాళ్ళు సంబంధం అనో కాకుండా అన్ని పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తరువాత ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఈ రాశి వారు ఈ సం వత్సరం శని స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే కాలభైరవ రూపు, సుబ్రహ్మణ్య స్వామి రూపు ధరించండి. ఎనిమిది (8) శనివారాలు శనికి తైలాభిషేకం, ఎనిమిది (8) మంగళ వారాలు కా లభైరవునికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. అదే విధంగా అఘోర పాశుపత ెమం చే యించడం చెప్పదగిన ముఖ్య సూచన. ప్రతి రోజు ఓం నమ:శివాయ వత్తులతో దీపారాధన చేయం డి. హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చేయండి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం, ఆదివారం వెళ్ళండి మంచి ఫ లితాలు సంప్రాప్తిస్తాయి.