Sunday, December 22, 2024

నగరంలో హార్స్ బెట్టింగ్

- Advertisement -
- Advertisement -

horse betting in hyderabad city

ఏదీ వదలని బెట్టింగ్ రాయుళ్లు
సులభ సంపాదన కోసం ఆడుతున్నారు
గతంలో హార్స్ బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకున్నవారు ఆర్గనైజర్లు

హైదరాబాద్: బెట్టింగ్ రాయుళ్లు దేనిని వదలడం లేదు, సాధారణంగా క్రికెట్‌లో ఎక్కువగా బెట్టింగ్‌ను చూస్తుంటాం. కానీ ఇటీవలి కాలంలో బెట్టింగ్ రాయుళ్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న దేనిని వదలడంలేదు. ఆన్‌లైన్ గుర్రపు పందాలను కూడా వదలడంలేదు, ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహించనట్లుగానే హార్స్ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా లక్షలాది రూపాయలను బెట్టింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ఎల్‌బి నగర్‌కు చెందిన వ్యక్తి హార్స్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి డబ్బులు గుగుల్‌పే, ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుని నిర్వహిస్తున్నాడు. దీని కోసం నిందితుడు టీమును ఏర్పాటు చేసుకుని పంటర్లను నియమించుకున్నాడు. ఆసక్తి ఉన్న యువకులకు యూజర్ నేమ్,పాస్‌వర్డ్ ఇచ్చి బెట్టింగ్ కట్టేలా చేస్తున్నాడు. ప్రధాన నిర్వాహకుడు తిరుమల్ రెడ్డి గతంలో హార్స్ రేసింగ్ బెట్టింగ్‌లో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. అదే హార్స్ రేసింగ్ నిర్వహించిన తిరిగి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. తనకు సన్నిహితులతో టీమును ఏర్పాటు చేసుకుని బెట్ 365 ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో చాలామంది ఇంటి వద్ద ఉంటున్నారు. ఈ సమయంలో కూడా నిందితుడు బెట్టింగ్ నిర్వహించాడు.

వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి బెట్టింగ్ డబ్బులు తీసుకునేవాడు. బెట్టింగ్ నిర్వహణ కోసం అకౌంటెంట్, పంటర్లను నియమించుకున్నాడు. ఇలా పలువురిని బెట్టింగ్‌లో పాల్గొనేలా చేశాడు. నిందితుడితోపాటు ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు రూ.45లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బన్సీలాల్‌పేటకు చెందిన సత్తిజయ వెంకటఅశోక్‌రెడ్డి, కూరపాటి నరేందర్‌రెడ్డి ఆన్‌లైన్ హార్స్ బెట్టింగ్ కట్టి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. మొబైల్‌లోనే బెట్365 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 106మంది వీరి వద్ద బెట్టింగ్ కడుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారిని పంటర్లుగా నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి బ్యాంక్‌లోని రూ.2.87లక్షలు సీజ్ చేశారు, రూ.46,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోగొట్టుకున్న చోటే…
బెట్టింగ్ నిర్వాహకులు గతంలో తాము డబ్బులు పోగొట్టుకున్న చోటనే డబ్బులు సంపాదించాలని నిందితులు ప్లాన్ వేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. హార్స్ బెట్టింగ్ నిర్వహించే వారిలో ఇందులోనే బెట్టింగ్ కట్టి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. వీరు తాము పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాలని ప్లాన్ వేసి అమాయకులను ఇందులోకి దింపి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అందరూ గతంలో హార్స్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నవారే ఉన్నారు.

ఐపిఎల్ లేని సమయంలో హార్స్…
ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు లేని సమయంలో నిందితుడు హార్స్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌కు అలవాటుపడ్డ పలువురు హార్స్ బెట్టింగ్‌కు ఆకర్షితులు అవుతున్నారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు దీనిని సొమ్ము చేసుకుంటున్నారు. ఐపిఎల్ మాదిరిగానే పంటర్లను నియమించుకుని యువకులను హార్స్ బెట్టింగ్‌లోకి లాగుతున్నారు. ఇండియాలో ఐపిఎల్‌కు క్రేజ్ చాలా ఉంది, దానిని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు వందల కోట్లతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపిఎల్ లేనిసమయంలో బెట్టింగ్ కట్టేవారికి ఏమీ తోచకపోవడంతో ఏ బెట్టింగ్ నడుస్తే అందులో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. ఇలా బయటికి వచ్చిందే హార్స్ బెట్టింగ్, దీనిపై పెద్దగా ఇక్కడ ఎవరూ ఆడరు కానీ బెట్టింగ్ వ్యసనాలకు అలవాడు పడ్డ వారు దీనిలో పాల్గొని లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News