Wednesday, January 22, 2025

హార్స్ రేసింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Horse racing gang arrested in hyderabad

ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులు
రూ.5,02,131 విలువైన సొత్తు స్వాధీనం

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో హార్స్ రేసింగ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు రూ.46,000, తొమ్మిది మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లు, బ్యాంక్‌లోని రూ.2,87,131 ఫ్రీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం….సిద్ధిపేట జిల్లా, తోటమండలం, ఘన్‌పూర్‌కు చెందిన అంకం మహేంద్ర వర్మ వ్యాపారం చేస్తు, నగరంలోని బన్సీలాల్‌పేటలో ఉంటున్నాడు. ఎంపిలోని తాడేపల్లిగూడెంకు చెందిన సత్తిజయ వెంకట అశోక్ రెడ్డి, కూరపాటి నరేందర్ రెడ్డి నగరంలోని అమీర్‌పేటలో ఉంటున్నారు. మహేంద్ర వర్మ ఆన్‌లైన్ హార్స్ బెట్టింగ్ నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు.

లాక్‌డౌన్ సమయంలో హార్స్ రేసింగ్‌ను నిషేధించడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్‌లో బెట్365యాప్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారిని పంటర్లుగా నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి దానిలో వివరాలు పెడుతున్నాడు. నగరంలో మహేంద్రా వర్మకు 106 మంది బెట్టింగ్ కడుతున్నారు. బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారి నుంచి డబ్బులు ఈ వాలెట్, గూగుల్ పే, ఫోన్ పే తదితర వాటి నుంచి తీసుకుంటున్నాడు. తనకు సాయంగా ఉండేందుకు మిగతా ఇద్దరిని నియమించుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి, రవికుమార్, ఎస్సైలు రాజు, ఎండి తకియుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News