Sunday, December 22, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు హార్టికల్చర్ డిప్లామా కోర్సు

- Advertisement -
- Advertisement -

Horticulture Diploma Course for Students in Government Schools

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవతరగతి పూర్తి చేసిన విద్యార్దులకు కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులో చేరేందుకు అవకాశం కల్పించింది. గ్రామ భారతి హార్టీకల్చర్ పాలిటెక్నిక్ కాలేజిలో డిప్లామా ఇన్ హార్టీకల్చర్‌లో కోర్సును ఈ ఏడాది నుంచే గుర్తించింది. రెండు సంవత్సరాల ఈ కోర్సును పూర్తి చేయడానికి కోర్సు ఫీజ్ , హాస్టల్ ఫీజ్‌తో కలిపి లక్షరూపాయల వరకూ ఖర్చు కానుంది.అయితే ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిన పేద విద్యార్ధులకు ఈ ఫీజు మొత్తాన్ని దాతల సహకారంతో ఫౌండేషన్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి బిఎస్సీ హార్టీకల్చర్ ప్రవేశాల్లో 15శాతం రిజర్వేషన్ కల్పించారు.

ఉద్యోగ ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న ఈ కోర్సులో ఉచింతంగా చేరేందుకు కొద్దిమందికి మాత్రమే అవకాశాలు కల్పించారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్దులు కోర్సు ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందే అవకాశం కల్పించారు. డిప్లమా కోర్సులో చేరాలనుకునే విద్యార్దులు ఎస్‌ఎస్‌సి మార్కుల సర్టిఫికెట్ , అధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకుని నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో ఉన్న కాలేజిలో ఈ నెల 25న ఉదయం 10గంటలకు సంప్రదించాలని కళాశాల నిర్వాహకులు పివి రావు (9490192672) తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News