Sunday, January 19, 2025

ఉద్యాన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి ప్రతినిధి : ఉద్యాన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో పండ్ల తోటల నర్సరీల పెంపకంపై మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న మోజర్ల శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం కళాశాల విద్యార్థులకు బుధవారం మంత్రి సర్టిఫికెట్ల ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు అన్న ఆలోచన లేకుండా భిన్నరంగాలలో రాణించాలని చెప్పారు. గ్రూప్స్ ,సివిల్స్ ఉద్యోగాల మీద దృష్టిసారించాలన్నారు. నిరంతరం ఏ దో పనిలో నిమగ్నం కావాలి …జీతం మీద కాకుండా పని మీ ద దృష్టిపెట్టాలన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసించిన వారు కలెక్టర్, ఆపై స్థాయి ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారన్నా రు. వ్యవసాయ భూములు ఉన్న విద్యార్థులు వ్యవసాయం మీ ద దృష్టి సారించాలనీ అన్నారు.

విభిన్న రకాల పంటలు సాగుచేయాలి..సాగులో అద్భుతాలు సృష్టించాలి.. ఇతరలకు మార్గదర్శనంగా ఎదగాలనీ చెప్పారు. ఎల్‌ఐసీ ఏజెంట్లను ఆదర్శంగా తీసుకుని రైతుల వద్దకు వెళ్లి వారికి పంటలసాగుపై సలహాలు ఇవ్వాలనీ సూచించారు. సొంతంగా మీరే రైతులతో ఒక నెట్ వర్క్ ను సృష్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ నీరజాప్రభాకర్, డీన్‌ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ అడప కిరణ్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News