Monday, December 23, 2024

ఇక నర్మదాపురంగా హోషంగాబాద్ రైల్వే స్టేషన్

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ రైల్వేస్టేషన్ పేరును పశ్చిమ మధ్య రైల్వే నర్మదాపురంగా మార్చినట్లు ఒక అధికారి ఆదివారం చెప్పారు. హోషంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును నర్మదాపురంగా మారుస్తున్నట్లు ప్రకటిస్తూ పశ్చిమ మధ్య రైల్వే శనివారం ఒక ప్రకటన జారీ చేసినట్లు ఆ అధికారి తెలిపారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోషంగాబాద్ సిటీ పేరును నర్మదాపురంగా మార్చే ప్రతిపాదనకు కేంద్రం గత ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది.

కాగా సిటీ రైల్వే స్టేషన్ పేరును కూడా మార్చడానికి కేంద్రప్రభుత్వం నో అబ్జెక్షన్ మంజూరుచేసినట్లు పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాల పేర్లను మార్చే ప్రక్రియ 2021లో ప్రారంభమైంది. హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ పేరును గోండా రాణి రాణి కమలాపతిగా మార్చడంతో ఇది మొదలైంది. ఘోరీ వంశానికి చెందిన మాల్వా రాజు హోషంగ్ షా ఘోరి ఈ పట్టణాన్ని జయించడంతో హోషంగాబాద్‌కు ఆ పేరు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వ వెబ్‌సైట్‌ను బట్టి తెలుస్తోంది. కాగా నర్మదాపూర్ అనేది నగరానికున్న ఒకప్పటి పేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News