హోషియార్‌పూర్(పంజాబ్): పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని ఖురల్‌గఢ్ సాహిబ్ వద్ద బైశాఖి వేడుకలు జరుపుకోవడానికి వెళుతున్న ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన భక్తులపైకి ఒక ట్రక్కు దూసుకెళ్లడంతో ఏడుగురు భక్తులు మరణించారు.
గురువారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. మృతులంతా ముజఫర్‌నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరాకు చెందిన వారని డిఎస్‌పి శంకర్ తెలిపారు. ఈ దుర్ఘటన జరిగిన ప్రదేశం కొండల మధ్యలో ఉందని ఆయన చెప్పారు.
Also Read: ఎద పొంగులను చూపిస్తూ సెగలు రేపుతున్న కీర్తి సురేష్
కొండ దిగుతున్న సమయంలో వాహనం డ్రైవర్ అదుపులో లేకపోవడంతో ట్రక్కు భక్తులపైకి దూసుకెళ్లిందని ఆయన చెప్పారు. ట్రక్కు బ్రేకులు ఫెయిలైనట్లు అనుమానిస్తున్నామని ఆయన చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు భక్తులను చండీగఢ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
గురు రవిదాస్‌కు చెందిన ఆధ్యాత్మిక కేంద్రం ఖురల్‌గఢ్ సాహిబ్‌కు బైశాఖి ఉత్సవం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.