హైదరాబాద్: భాగ్యనగరంలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. బస్తీ దవాఖానాలతో హైదరాబాద్ నగరంలో పేదలకు మెరగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వరంగల్, కరీంనగర్, ఇతర కార్పొరేషన్లకు బస్తీ దవాఖానలు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. రోజు రోజుకు నగరాలలో జనాభా పెరుగుతుండడంతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించాడు. ఢిల్లీలోని మొహల్లా క్లీనిక్‌లను ఆదర్శంగా తీసుకొని బస్తీ దవాఖాన ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి పదివేల జనాభాకు బస్తీ దవాఖాన ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బస్తీ దవాఖానాలో వైద్యుడు, స్టాఫ్ నర్సుతో అటెండర్ ఉంటారని, ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సేవలు అందిస్తాయన్నారు. బస్తీ దవాఖానాలను డయగ్నోస్టిక్ సెంటర్లతో అనుసంధానం చేస్తున్నామని ఈటెల స్పష్టం చేశారు.
ప్రతి పదివేల జనాభాకు బస్తీ దవాఖాన: ఈటెల
- Advertisement -
- Advertisement -
- Advertisement -