Thursday, January 23, 2025

ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి  : ప్రభుత్వ వేతనం పొందుతున్న ప్రతి ఉద్యోగి తన విధుల పట్ల నిర్లక్షం వహిస్తే ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం ఉదయాన్నే వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, కొత్తకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ బాలుర, బాలికల పాఠశాలను సందర్శించి ఉదయాన్నే ప్రార్థనలో పాల్గొని అందరిని ఆశ్చర్య చకితులను చేశారు.

అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. అందరికి ఏకరూప దుస్తులు వచ్చాయా, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కులు, నోట్ పుస్తకాలు అందాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అన్ని వచ్చాయని విద్యార్థులు తెలిపారు. శ్రద్ధతో బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. బోర్డుపై రాసి విద్యార్థుల సామర్థాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను బహుకరించారు. అంతకు ము ందు కలెక్టర్ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్న పరిశుభ్రత, రోగులకు ఉదయాన్నే ఇచ్చే పాలు, బ్రెడ్ నాణ్యతను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను వైద్య సిబ్బంది ఆప్యాయతతో పలకరించి వారికి అవసరమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కొత్తకోటలో మున్సిపల్ వార్డులలో తిరుగుతూ పారిశుద్ధాన్ని పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ంలో మున్సిపల్ కమిషనర్, ఇతర సిబ్బందితో స మావేశమై మాట్లాడారు. పారిశుధ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని, ప్రతి వార్డుకు సిబ్బంది ని కేటాయించి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మరోమారు వచ్చినప్పుడు వార్డులు అని పరిశుభ్రంగా కనిపించాలని హెచ్చరించారు. ప్రభుత్వ వేతనం పొందుతున్న ప్రతి ఉద్యోగి తన విధుల ప ట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి ప్రజలకు సేవ చేయాలన్నారు. అప్పుడే జిల్లా అభివృద్ధితో పాటు ప్రజల జీవ ప్రమాణాలు మెరుగుపడుతాయన్నారు. కలెక్టర్ వెంట కొత్తకోట మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News