- Advertisement -
న్యూఢిల్లీ : ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ గౌరవ చైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు 94 ఏళ్లు, ఆయన మరణం గురించి ఒబెరాయ్ గ్రూప్ సమాచారం ఇచ్చింది. సాయంత్రం 4 గంటలకు కపషేరాలోని ఒబెరాయ్ ఫామ్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భారతదేశంలో హోటల్ వ్యాపారానికి కొత్త దిశను అందించడంలో ఆయన కీలపాత్ర పోషించారు. పృథ్వీ రాజ్ సింగ్ 2002లో తన తండ్రి మరణం తర్వాత ఒబెరాయ్ గ్రూప్ కంపెనీ ఇఐహెచ్ లిమిటెడ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
- Advertisement -