ముంబై: ఏడాది తర్వాత ముంబైలోని ఆసుపత్రులలో తిరిగి కోవిడ్ వార్డులు తెరిచారు. కోవిడ్ వ్యాధిగ్రస్తులు మెల్లిగా పెరుగుతుండడంతో వీటిని తిరిగి తెరిచారు. మహారాష్ట్రలో 397 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా యాక్టివ్ కేసులు అక్టోబరు నుంచి మొదటిసారి 2000 సంఖ్యను దాటింది. ముంబై నగరంలో 123 కొత్త కేసులు నమోదయ్యాయి. వివిధ ఆసుపత్రులలో కొత్తగా 17 మంది చేరారు. కొన్ని నెలల తర్వాత మళ్లీ కొవిడ్ రోగుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 43 మంది రోగులు ముంబై నగరంలోని ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యారు. వారిలో 21 మంది ఆక్సిజన్ సపోర్టు మీద ఉన్నారు. కొవిడ్ కేసుల కోసం 15 బెడ్ల వార్డులను, ఐసియూలను సిద్ధంగా ఉంచామని లీలావతి ఆసుపత్రి సిఈవో డాక్టర్ వి. రవిశంకర్ తెలిపారు. రోగుల వద్దకు వెళ్లే వారు మాస్కుల ధరించడం వంటి ప్రోటోకాల్స్ పాటించాలని నిర్దేశించారు. బాంబే ఆసుపత్రి, హిరనందనీ ఆసుపత్రిలో కొవిడ్ రోగుల కోసం అంతా సిద్ధం చేశారు.