Tuesday, December 24, 2024

బేగంపేట్, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్‌లోని విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంత పూర్, బేగంపేట్ స్కూల్లో చదువుతున్న గిరిజన బాల బాలికలకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇవ్వడం పట్ల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం మంత్రి కలిసి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. గత జూన్ 21 జాతీయ అధ్యక్షులు మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారి నాయకత్వంలో ఆల్ ఇం డియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి ప్రజాకవి గాయకులు భ ట్టు వెంకన్న చవాన్ నిర్వహించిన నిరాహార దీక్ష నిర్వహించారు.

ఈ దీక్ష సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ మరియు బేగంపేట్ బాల బాలికలకు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ట్రై కార్ చైర్మన్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రనాయక్ చొరవతో శాశ్వత హాస్టల్ వసతి కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇవ్వడంతోనే ఈ నిరాహార దీక్ష విరమించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ వాలినాయక్ మరియు గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News