Friday, February 14, 2025

అనుమానాస్పద స్థితిలో హాస్టల్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన సంఘటన కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అవినాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ జ్లిలా మద్గల్‌ చిట్టెంపల్లి తండాకు చెందిన నేనావత్ దేవేందర్ (16) కుల్కచర్ల గిరిజన వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్నాడు. రోజులాగానే రాత్రి భోజనం చేసి టీ తాగి పడుకున్న విద్యార్థి తెల్లారినా దేవేందర్ నిద్ర లేవకపోవడంతో తోటి విద్యార్థులు చూసేసరికి

శ్వాసలేకపోవడంతో వెంటనే 108 సహాయంతో పరిగి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. విద్యార్థి దేవేందర్ అప్పటికే ముందు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారిచారు. దేవేందర్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళ చేపట్టారు. హాస్టల్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. వసతి గృహంలో ఏదో జరిగి మా కుమారుడు మృతి చెందిన ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థి తండ్రి చందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అవినాష్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News