Thursday, December 19, 2024

భార్యను కొట్టి… బాలికపై వేడి పాలు పోసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: భార్యను కొట్టి కూతురుపై తండ్రి వేడి వేడి పాలు పోసిన సంఘటన హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భోండ్సి ప్రాంతంలో దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కూతురు ఉంది. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో భర్తపై భార్య గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి భార్య తన కూతురుతో కలిసి తన తల్లిగారింట్లో ఉంటుంది. భర్త తన భార్య, కూతురిపై దాడి చేశారు. అనంతరం కూతురుపై తండ్రి వేడి పాలు పోయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిటి స్కాన్ తీయగా బాలిక తలకు తీవ్రగాయమైనట్టు తేలింది. బాలిక తాతయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు జువైనల్ యాక్ట్‌తో పాటు ఐపిసి 325, 323 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News