Thursday, January 23, 2025

మాజీ ప్రియుడిపై మరుగుతున్న నీళ్లు పోసి…. బీరు బాటిల్‌తో కొట్టి

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: తన ఇష్టానికి విరుద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకున్నందుకు తన మాజీ ప్రియుడిపై సలసల మరుగుతున్న వేడి నీళ్లను పోసి అతడిపై హత్యాయత్నానికి ఒడిగట్టింది మహిళ. 50 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో ఆ మాజీ ప్రియుడు. బొమ్మసంద్రలోని యరండహల్లికి చెందిన 3 ఏళ్ల విజయ్ శంకర్ భీమ శంకర్ ఆర్య అలియాస్ విజయ్ కుమార్ చామరాజ్‌పేట్‌లోని ఒక వస్త్ర కంపెనీలో ఫోటో ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. అదే పట్టణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా జ్యోగి దొడ్డమణి అనే మహిళ పనిచేస్తోంది. ఒకే ఊరికి చెందిన వీరిద్దరికీ గత ఐదేళ్లుగా పరిచయం ఉంది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అయితే తనకు ఇదివరకే వివాహమైన విషయాన్ని విజయ్ దగ్గర జ్యోతి దాచింది.
అయితే.. జ్యోతికి వివాహమైన విషయం తెలియడంతో విజయ్ ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కాని జ్యోతి మాత్రం తమ ప్రయాణం కొనసాగాలని, తనను వివాహం చేసుకోవాలని అతడిపై ఒత్తిడి పెంచసాగింది.

Also Read: గుంట నక్కలవి పగటి వేషాలు: సజ్జల

ఏడు నెలల క్రితం విజయ్ బెంగళూరు చేరుకుని ఎండి బ్లాక్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. జ్యోతి కూడా నెల రోజుల తర్వాత బెంగళూరు వచ్చేసి విజయ్ ఇంట్లోనే చేరిపోయింది. దీంతో విజయ్ యరందహల్లిలోని తన స్నేహితుడి ఇంటికి మారిపోయాడు. అప్పుడప్పుడు జ్యోతిని ఆమె ఇంటి వద్ద కలుస్తుండేవాడు. కాగా..మే 11న విజయ్‌కు మరో యువతితో వివాహమైంది. మే 23న విజయ్ బెంగళూరు చేరుకున్నాడు. మే 25న విజయ్‌కు ఫోన్ చేసిన జ్యోతి తన పుట్టినరోజు ఏర్పాట్ల కోసం ఇంటికి రావాలని కోరింది. ఆమె ఇంటికి వెళ్లిన విజయ్ తనకు కూడా పెళ్లయింది కాబట్టి ఇక తమ మధ్య ఎటువంటి సంబంధం వద్దని, స్నేహితులుగానే కొనసాగుదామని ఆమెకు చెప్పాడు.

ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయిన విజయ్ తనకు ఓంట్లో బాగాలేదని, సెలైన్ ఎక్కించాలని జ్యోతిని కోరాడు. ఆ రాత్రి అక్కడే విజయ్ నిద్రపోయాడు. మరుసటి రోజు..మే 26వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకే నిద్రలేచిన జ్యోతి వేడి నీళ్లు స్టౌపైన కాచింది. సలసల మరుగుతున్న నీళ్లను తీసుకువచ్చి నిద్రపోతున్న విజయ్‌పై పోసింది. హఠాత్తుగా నిద్రలేచిన విజయ్ ఆమెను తోసివేసే ప్రయత్నంలో వంటగ్యాసు సిలిండర్ తలకు కొట్టుకోవడంతో తలకు గాయమైంది. ఇంతలో బీరు బాటిల్‌తో అతని తలపై కొట్టిన జ్యోతి తలుపుకు బయటనుంచి గడియపెట్టి అక్కడి నుంచి పారిపోయింది.

విజయ్ ఆర్తనాదాలు విన్న ఇంటి యజమాని తలుపులు తెరిచి చూడగా కాలిన గాయాలతో ఉన్న విజయ్ కనిపించాడు. వెంటనే అతడిని విక్టోరియా ఆసుపత్రికి తరలించాడు. విజయ్ శరీరం 50 శాతం కాలిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జ్యోతిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News