Thursday, January 16, 2025

హోటల్ గదిలోకి లాక్కెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

లక్నో: హోటల్ గదిలోకి లాక్కెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత సంవత్సరం నుంచి యువతి సదరు హోటల్‌లో పని చేస్తుంది. ఆ హోటల్‌లో స్నేహితురాలితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది. స్నేహితురాలుకు మరో నలుగురు స్నేహితులు ఉన్నారు. బలవంతంగా ఆ యువతికి మద్యం తాగించారు. అనంతరం ఆమె గదిలోకి లాక్కెళ్లి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. సదరు యువతిని గదిలోకి లాక్కెళ్లిన దృశ్యాలు హోటల్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మహిళతో మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News