- Advertisement -
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో హోటల్ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడింది. స్విగ్గి డెలివరీ బాయ్ పై హోటల్ యాజమాన్యం దాడికి చేసింది. డెలివరీ బాయ్ ఫుడ్ సర్వీస్ కోసం హోటల్ కు వచ్చి అరగంట ఎదురుచూశాడు. ఫుడ్ ఆలస్యం కావడంతో హోటల్ యజమానిని అడిగినందకు బాయ్ పై దాడి చేశారు. స్విగ్గి డెలివరీ బాయ్ పై దాదాపు 20 మంది హోటల్ సిబ్బంది రాడ్లు, కర్రలతో దాడి చేసినట్టు బాధితుడు తెలిపాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన డెలివరీ బాయ్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ స్విగ్గి డెలివరీ బాయ్స్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -