Friday, January 10, 2025

చంద్రుడిపై హాట్‌పోట్లు

- Advertisement -
- Advertisement -

విక్రమ్ ల్యాండర్ ఛేస్ట్ పేలోడ్ గ్రాఫ్ విడుదల

ఊహించని రీతిలో దక్షిణధ్రువంపై భిన్న రకాల ఉష్ణోగ్రతలు నమోదు

బెంగళూరు: విజయవంతంగా జాబిల్లిపై బుడిబుడి అడుగులు వేస్తున్న చంద్రయాన్ 3 తన పనిలో నిమగ్నమైంది. పరిశోధనా ఫలితాలను ప్రపంచం ముందుకు తీసుకు వ స్తోంది. తొలి ఫలితంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతల తీరును విశ్లేషించింది. చంద్రునిపైగల నేల ఉష్ణోగ్రత లు, చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతులో ఉ ష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయో వెల్లడించింది. ఈనెల 23న విజయవంతంగా చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాం డర్‌లోని ఛేస్ట్ పేలోడ్ పంపించిన ఈ తొలిఫలితాలను ఇస్రో ఆదివారం వెల్లడించింది. చంద్రుని దక్షిణ ధ్రువం వెం బడి ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును ఛేస్ట్ (చంద్రా స్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ ) కొలిచిందని ఇస్రో తెలిపింది. దీని ఆధారంగా చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మారే తీరును అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. ఛేస్ట్ చంద్రుని ఉపరితలంలో వేర్వే రు లోతుల్లో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతల తేడాలను చూపిస్తున్న ఓ గ్రాఫ్‌ను కూ డా ఇస్రో ట్వీట్ చేసింది. ఊహించిన దానికంటే ఆశ్చర్యకరమైన రీతిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు.

‘మేమం తా విశ్వసించిన దాని ప్రకారం జాబిల్లి ఉపరితలంపై 20నుంచి30 డిగ్రీల సెంటీగ్రేడ్ నడుమ ఉష్ణోగ్రత ఉంటుందనుకున్నాం. కానీ 70డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవ్వడాన్ని చూసి అశ్చర్యపోయాం’ అని ఇస్రో సైంటిస్ట్ బిహెచ్‌ఎం దారుకేశ పిటిఐతో వ్యాఖ్యానించారు. చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి ఉష్ణోగ్రతలను కొలిచేందుకు తగిన పరికరాలను ఛేస్ట్ లో అమర్చినట్టు ఇస్రో తెలిపింది. ఉపరితలం నుంచి కిందికి చొచ్చుకెళ్లే ప్రక్రియ నియంత్రణతో జరుగుతుందని తెలిపింది. దీనికి విడివిడిగా 10 టెంపరేచర్ సెన్సర్లను అమర్చినట్టు తెలిపింది. చంద్రుని దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఉష్ణోగ్రతలు మారే తీరును వివరించే మొ దటి సమాచారం ఇది. ఈ గ్రాఫ్‌ను పరిశీలించినప్పుడు చంద్రునిపై ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి దాదాపు 70 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నట్లు స్పష్టమైంది. 80 మిల్లీ మీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లు ఇస్రో తెలిపింది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇది తొలి ప్రొఫైల్ అని ఇస్రో పేర్కొంది. పూర్తి స్థాయి పరిశీలనలు జరుగుతున్నాయని వివరించింది. ఇక ఈ ఛేస్ట్ పేలోడ్‌ను స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, వీఎస్‌ఎస్‌సీ, అహ్మదాబాద్ లోని పీఆర్‌ఎల్ సహకారంతో అభివృద్ధి చేసి, తయారు చేసినట్టు తెలిపింది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. చంద్రయాన్ 3 లో ఏడు పేలోడ్సు ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్ పైన 4, ప్ర జ్ఞాన్ రోవర్ పైన 2 ఉన్నాయి. మరొకటి ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్. వీటి ని వేర్వేరు శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించారు. మరోవైపు తిరువనంతపురంలో ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ మాట్లాడుతూ పరిశోధనలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చంద్రయాన్ పంపుతోందని, వాటి ని తమ శాస్త్రవేత్తలు విశ్లేషించి ప్రపంచానికి చాటుతారని తెలిపారు.
అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా మనకుంది : ఇస్రో ఛైర్మన్
తిరువనంతపురం: భారత్‌కు చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల పైకి వెళ్లే సత్తా ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. అయితే ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు. చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో ప్రణాళికల గురించి ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ భారత్‌కు చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల పైకి వెళ్లి పరిశోధనలు చేసే సత్తా ఉంది. అందుకు మన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలి. దాం తోపాటు అంతరిక్ష పరిశోధనలకు పెట్టుబడుల అవసరం కూడా ఉంది. దా నివల్ల అంతరిక్ష పరిశోధన రంగంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదే మా లక్షం” అని సోమనాథ్ అన్నారు. అలాగే దేశ అంతరిక్ష రంగ అభివృద్ధి గురించి ప్రధాని మోడీకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ప్రధాని తమకు నిర్దేశించిన భవిష్యత్తు లక్షాలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సోమనాథ్ వెల్లడించారు. కేరళ లోని తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సోమనాథ్ ఆదివారం సందర్శించారు. విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అనే పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు. శివశక్తి తిరంగా (చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి పెట్టిన పేరు . రెండు పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు. జీవితంలో సైన్స్, ఆధ్యాత్మికం రెండు అంశాల పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు. అందుకే వివిధ ఆలయాలను సందర్శించడంతోపాటు అనేక గ్రంథాలను చదివి విశ్వంలో మనిషి మనుగడకు ఉన్న నిజమైన అర్థాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. చంద్రయాన్ 3 లో ల్యాండర్,రోవర్ పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. వాటి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని , రాబోయే రోజుల్లో వివిధ మోడల్‌లలో ల్యాండర్, రోవర్ పనితీరును పరీక్షించాల్సి ఉందని తెలిపారు. అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Temperature graph

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News