Sunday, November 17, 2024

1,25,000 సంవత్సరాల రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : భారత్‌లో ఉన్న వారికి వానలు వరదలు, ముంపులుగా ఈ ఏడాది ఇప్పటి జులై నిలిచికలిచివేస్తుంది. అయితే ఇందుకు భిన్నంగా ఈ 2023 జులై మాసం ప్రపంచస్థాయిలో సగటు ఉష్ణోగ్రతల క్రమంలో గడిచిన లక్ష సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత హాట్ ఇయర్‌గా రికార్డులోకి చేరింది. జులై 4వ తేదీ 1,25,000 సంవత్సరాలలో భూమిపై అత్యంత వేడితో కూడిన రోజుగా రికార్డుల్లోకి చేరింది. ఈ విధంగా వరుసగా రెండో సంవత్సరం కూడా దాదాపుగా ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ నెల 4వ తేదీన ప్రపంచస్థాయిలో సగటు ఉష్ణోగ్రత 17.18 డిగ్రీలు సెల్సియస్( 62.92 డిగ్రీఫారెన్‌హీట్లు) కు చేరుకుందని మైనేకు చెందిన క్లైమెట్ ఛేంజ్ సంస్థ తెలిపింది.

అంతకు ముందు రోజు జులై 3వ తేదీన ఇది 17.01 డిగ్రీల సెల్సియస్‌గా ( 62.62 ఫారెన్‌హీట్స్‌గా ) ఉంది. 2022 జులై 24న , అంతకు ముందు 2016 ఆగస్టు 14వ తేదీన సగటు ఉష్ణోగ్రతలు 16.92 డిగ్రీలుగా నిలిచాయి. పర్యావరణ పరిస్థితులలో అత్యంత దారుణరీతిలో తలెత్తిన అసాధారణ దశకు ఈ జులై అద్దం పడుతోంది. భారతదేశంలో కుండపోత వానలు అయితే, యూరప్‌దేశాలలో అక్కడి జనం ఇంతకు ముందు ఎన్నడూ భరించని స్థాయిలో అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీస్ , ప్రపంచవాతావరణ సంస్థ ఈ వేడిదాడి గురించి సమగ్ర నివేదికను వెలువరించాయి. కాలగమనంలో గడిచిన లక్ష సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెల మూడు వారాలలో ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలతో గాలి వేడెక్కడం నేరుగా ప్రజలకు ఇబ్బందికరమే కాకుండా శరీరంలో కూడా అత్యంత తీవ్ర పరిణామాలకు దారితీస్తూ వస్తోందని, శారీరంగా పలు విధాలుగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో ఈ జులైలో ఇంతకు ముందు లక్ష సంవత్సరాలలో ఎప్పుడూ లేని స్థాయిలో పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. ఎప్పుడూ మైనస్ స్థాయిలో ఉండే ఉష్ణోగ్రతల్లో ఆకాశమంతరపు వ్యత్యాసాలు కన్పించడంతో అమెరికా, యూరప్ దేశాలు తల్లడిల్లుతున్నాయి. కోపర్నికస్ సంస్థ ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలను రికార్డు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది జులైలో 23రోజుల వ్యవధిలో వేడిని లెక్కతీసుకుని ప్రపంచవ్యాప్తంగా సగటు ఉషోగ్రతలను కోపర్నికస్ సంస్థ 16.95 డిగ్రీ సెల్సియస్‌గా పేరొంది. ఇది 2019 సంవత్సరపు రికార్డు 16.93 సగటు కంటే ఎక్కువ. ఎల్‌నినో ప్రభావంతో సముద్ర ఉపరితలం రగిలిపోవడం వాతావరణానికి ప్రతికూలతను తెచ్చిపెట్టింది. వేసవి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడానికి పలు కారణాలు దారితీశాయని పరిశోధకులు తెలిపారు.

అంతకు ముందు రికార్డు అయి ఉన్న పురాతన ఉష్ణోగ్రతల రికార్డులు చెట్ల మానుల్లోని వలయాలు, కోరల్ రీఫ్స్, సముద్ర గర్భం నుంచి సేకరించిన పలు నమూనాల ప్రాతిపదికన లెక్కిస్తారని కోపర్నికస్ సంస్థ ఉప సంచాలకులు సమంత బర్గెన్ తెలిపారు. ఇప్పుడు నెలకొన్న ఉష్ణోగ్రతలు మానవ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనివి అని పేర్కొన్నారు.
గ్లోబల్ వార్మింగ్ కాదు ఇక గ్లోబల్ బాయిలింగ్ దశ
ఇప్పటి ఉష్ణోగ్రతలపై ఐరాస అధినేత గుటెర్రస్ వ్యాఖ్య
ఇప్పుడు నెలకొన్న ఉష్ణోగ్రతలతో భూమి అత్యంత ఆందోళనకర విధ్వంసకర స్థితికి చేరుకుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. జులై నెల వేడిపై ఆయన స్పందించారు. ప్రపంచ స్థాయిలో ఇంతకు ముందటి రికార్డులు ఇప్పుడు ఈ వేడితో తుడిచిపెట్టుకుపోతున్నాయని, ఇక మనం గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచించడం కాదు, గ్లోబల్ బాయిలింగ్ గురించి స్పందించి అనుభవించాల్సి ఉంటుందని తీవ్రస్థాయి వ్యాఖ్యలకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News