శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురిని శనివారం గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్ గుప్కార్ రోడ్డులోని ఫరూక్‌అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా, మెహబూబాముఫ్తీ ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా మూసివేశారు. భద్రతాదళాలను వారి ఇళ్లముందు మోహరించారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ స్థానాలను పునర్‌వ్యవస్థీకరించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ చేసిన సిఫారసులను ఫరూక్ నేతృత్వంలోని గుప్కార్ కూటమి వ్యతిరేకిస్తోంది. జనవరి 1న శ్రీనగర్‌లో నిరసన ప్రదర్శనకు కూటమి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నేతల ఇళ్ల చుట్టూ పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. జమ్మూకు ఆరు, కాశ్మీర్‌కు ఒక స్థానం పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. అధిక జనాభా ఉన్న కాశ్మీర్‌కు ఒక్కటే పెంచడమేమిటని కూటమి నేతలు మండిపడుతున్నారు. తన తండ్రి, తన సోదరీమణులు, తన ఇళ్ల ముందు భద్రతా దళాలను మోహరించిన దృశ్యాలను మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్ చేశారు.
శ్రీనగర్‌లో ముగ్గురు మాజీ సిఎంల గృహనిర్బంధం
- Advertisement -
- Advertisement -
- Advertisement -