Sunday, December 22, 2024

షాట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్దం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గద్వాల: మండల పరిధిలోని కొండపల్లి గ్రామంలో సోమవారం రాత్రి షాట్‌సర్కూట్ తో ఇల్లు(రేకుల షెడ్డు) దగ్దం కాగ సుమారు రూ.8లక్షలు ఆస్థిం నష్టం వాటిలింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొండపల్లి గ్రామానికి చెందిన గుంతల జగదీష్ తన ఇంటిలో (రేకుల షెడ్డు) సప్లయర్ సామాన్ల దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తుండు. సోమవారం రాత్రి షాట్ సర్కూట్ కొట్టడంతో రేకుల షెడ్డులో ఉన్న సప్లయర్ సామాన్లు, టెంట్‌లు, గిన్నెలు, ఇంట్లో ఉన్న దుస్తులు పూర్తిగా అగ్నికి అహుతి కాగా.. అదే విధంగా ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైంది.

ఇదే ఘటనలో ఆవుదూడ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. మంటలను గమనించిన స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు మంటలార్పేందకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పాడం జరిగింది. సుమారు రూ.8లక్షల ఆస్థినష్టం వాటిలిందని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుడు జగదీష్ ప్రభుత్వ అధికారులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News