Monday, January 20, 2025

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

పినపాక : విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు చేరుకునేలోగా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ ఇంజన్ వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో బచ్చలకూరి రమణ, నాగేశ్వరరావు దంపతులకు చెందిన ఇంట్లో విలువైన వస్తువులు మొత్తం కాలి బూడిదయ్యాయి. బాధితులు ఇల్లు కాలిపోయిందని విలువైన వస్తువులు మొత్తం కాలిపోయాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News