Monday, December 23, 2024

విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం..

- Advertisement -
- Advertisement -

మహాదేవపూర్ : విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం సంఘటన సూరారం గ్రామంలో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన ములుకల లక్ష్మీ భర్త రాజయ్య ఇంట్లో శనివారం రోజున రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ ఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లేచి అరుపులు కేకలు వేశారు.

చుట్టూ పక్కల వారు వచ్చి మంటలు అర్పించడంతో ప్రాణహాని తప్పింది.మంటలు చెల రేగడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు బట్టలు బియ్యం డబ్బులు ఫర్నిచర్ మంటలలో కాలిపోవడం జరిగిందని పేర్కొన్నారు. సుమారు గా 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని కన్నీటి పరియతం మయ్యారు. వెంటనే ప్రభుత్వ అధికారులు బాధితురాలు ను ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News