Saturday, January 11, 2025

విషాదం.. భారీ వర్షాలకు ఇల్లు కుప్పకూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

గుజరాత్ విషాద సంఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ద్వారకా జిల్లా ఖంభాలియా తాలూకాలో ఓ ఇల్లు కుప్పకూలింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

శిథిలాల కింద నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. గుజరాత్‌లోని పోర్‌బందర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News