Wednesday, January 22, 2025

భారీ వర్షాలకు గూడు కోల్పోయిన ఇద్దరు యువతులు

- Advertisement -
- Advertisement -

గత మూడు రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల వరదలు సంభవిస్తున్నాయి. ప్రాజెక్టు లు వరద నీటితో నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. చెరువులు, కుంటల్లో భారీగా నీరు చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో పంటలకు భారీ నష్టం, మరికొన్నిచోట్ల పశు నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయినిపేటలో కుంట సమ్మక్క ఇల్లు పూర్తిగా కూలిపోయింది. చిన్నప్పుడే అమ్మనాన్న ను కోల్పోయిన ఇద్దరు యువతులు ఆత్మస్థైర్యంతో బతుకు నెట్టుకొస్తున్న వారికి ఇప్పుడు నిలువ నీడ లేకుండా పోయింది. వర్షం కారణంగా ఇల్లు కూలడంతో ఇంట్లో నిత్యవసర వస్తువులు, సామాగ్రి అంతా ధ్వంసమైందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఇద్దరు యువతులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News