మన తెలంగాణ/రాయికల్: భర్త మృతితో కుమారుడితో కలిసి బాత్రుంలో నివాసముంటున్న పేదింటి మహిళకు దాతల సహకారంతో ఇంటి నిర్మాణం పూర్తయింది. సహకరించిన దాతలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆమె తన కుమారుడితో కలిసి బుధవారం గృహ ప్రవేశం చేశారు. రాయికల్ మండలం రాజనగర్ గ్రామానికి చెందిన శోభారాణి అనే మహిళ తన భర్త మృతితో కుమారుడితో కలిసి బాత్రుంలో నివాసముంటున్నట్లు సమాచరం అందుకున్న గ్రామ ఎంపిటిసి సోమిరెడ్డి సురేంధర్‌రెడ్డి తన మిత్రులతో కలిసి ఆమె దీనగాథను పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకురాగ ఆమె గృహనిర్మాణం కోసం పలువురు దాతలు ముందుకు వచ్చారు. దాతల సహకారంతో గూడు ఏర్పాటు చేసుకున్న శోభారాణి అదే దాతలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయుల సమక్షంలో బుధవారం గృహప్రవేశం చేశారు. ఈ సమయంలో రాయికల్ పాత్రికేయులు కడకంట్ల జగదీశ్వర్ నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. ఆమె కుమారుడికి ఉచిత విద్యను అందించేందుకు విస్‌డమ్ విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఎద్దండి ముత్యంరాజు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా శోభారాణి దాతలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సురేంధర్‌రెడ్డి, ఆంజన్న, చల్లగాలి శ్రీనివాస్, బొమ్మకంటి నాగరాజు, బత్తిని నాగరాజు, చింతకుంట సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
దాతల సహకారంతో గృహనిర్మాణం పూర్తి
- Advertisement -
- Advertisement -
- Advertisement -