Thursday, January 23, 2025

షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

 

భైంసారూరల్ : మండలంలోని కుంసర గ్రామంలో సోమవారం రాత్రి షార్ట్ సర్కూట్‌తో ఇల్లు దగ్ధమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన విఠబాయి సాయంత్రం వేళ తన ఇంటికి తాళం వేసి తన కుమారుని ఇంటికి వెళ్లింది. విఠబాయి ఇంట్లో నుంచి మంటలు రావడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో 15 వేల నగదు, 2 గ్రాముల బంగారం కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News