Friday, December 20, 2024

అగ్నిప్రమాదంలో హవాలా డబ్బులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు శనివారం రాత్రి అగ్నిమాక శాఖకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి మంటలను ఆర్పివేశారు. తర్వాత ఇంట్లో భారీగా నగదు ఉందని సమాచారం రావడంతో గోపాలపురం పోలీసులు వెళ్లి తనిఖీలు చేయగా రూ.1.65కోట్ల నగదు, బంగారం, వెండి వస్తువులు లభ్యం అయింది. ఇంటి యజమాని నగరంలో లేకపోవడంతో అతడి తరఫున ఇద్దరిని తీసుకుని వెళ్లి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు.

Also Read: తమిళనాడులో కల్తీ మద్యంకు ముగ్గురు బలి

లెక్కల్లో చూపని డబ్బుగా గుర్తించామని, ఐటి అధికారులకు సమాచారం ఇచ్చామని గోపాలపురం సిఐ ఈశ్వర్ గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో ఓ ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇంట్లో ఉడ్‌కు సంబంధించిన వస్తువులు కాలిపోయాయి. కాగా, ఇంటి యజమాని శ్రీనివాస్‌తోపాటు మిగతా కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇంటి యజమాని శ్రీనివాస్ ఓ ప్రముఖ కంపెనీలో డిజిఎంగా పనిచేస్తున్నారు. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆయన హైదరాబాద్‌లో లేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News