Thursday, September 19, 2024

అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు ఇళ్ల స్థలం

- Advertisement -
- Advertisement -
ఎవరూ ఆందోళన చెందవద్దు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హామీ

హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలపై శుక్రవారం అల్లం నారాయణతో మాట్లాడానని, జవహర్‌లాల్ సొసైటీతో సహా ప్రతి జర్నలిస్ట్‌కు ఇళ్లు అందించే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కెటిఆర్‌ను టియూడబ్ల్యూజే 143 నాయకులు ఇళ్ల స్థలాలు, జర్నలిస్ట్ సమస్యలపై కలిశారు. వరంగల్, హనుమకొండ జిల్లాలోని జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ భూములు ఎక్కడ కేటాయించారో వాటి భూమి ధర చెల్లింపునకు ఖాతా నెంబరు వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.

ఖాతా నంబర్ ఇస్తే డబ్బులు

వరంగల్ జిల్లాలో రెండు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలు ఉండగా, అధికారులు గతంలో వాటికి భూములను కేటాయించారు. అయితే ఇందుకు సంబంధించి భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబర్ ఇస్తే తాము డబ్బులు చెల్లిస్తామని మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హౌసింగ్ సొసైటీల్లో లేని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై టియూడబ్ల్యూజే 143 నేతలు లెనిన్, కక్కెర్ల అనిల్ కుమార్ గౌడ్, తుమ్మ శ్రీధర్ రెడ్డి, మెండు రవీందర్, చిలుముల సుధాకర్, వెంకన్న, రాజేంద్రప్రసాద్ తదితరులు మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి రెండు హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులు పోగా, మిగిలిన సభ్యుల జాబితాను రూపొందించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సూచించారు. జాబితా ఫైనల్ అయితే వారికి కూడా ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించాలని మంత్రి కెటిఆర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రితో భేటీ అయిన వారిలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News