Saturday, November 23, 2024

టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు

- Advertisement -
- Advertisement -

3 దశల్లో పంపిణీ
పీస్ రేట్ కార్మికులకు రూ.20 వేల పెంపు
టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: తమ ఉద్యోగులకు ఇళ్ళపట్టాలు పంపణి చేయాలని టిటిడి నిర్ణయించింది. మంగళవారం జరిగిన టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీస్ రేట్ కర్షకులకు కనీసం వేతనం రూ.20 వేల పెంచే ప్రతిపాదనకు మండి ఆమోదం తెలిపింది. వీటితో పాటు లడ్డూ పోటులోని కార్మికులకు ఐదంగా రూ. వేల వేతనం పెంచేందుకు అంగీకరించింది. ముందుగా ఈనెల 23, 24వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులు, విఐపిలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేసిన ఈవో, బృందానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ భూమాన కరుణకర్‌రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగోన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టిటిడి ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి మొదటి దశలో డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామని, అదే విధంగా రెండో దశలో జనవరి మొదటి వారంలో 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేస్తాం. మూడో దశలో ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాలను భూమిని సమీకరించాల్సిందిగా కలెకర్టన్లు కోరామన్నారు. దీని ద్వారా 5 వేల లబ్ది చేకూరుతుందని, వీరికి కూడా ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, ఉద్యోగులందరికి ఇళ్ళ స్థలాలు అందించినట్లు అవుతుందన్నారు. ఈ ఇళ్ళ స్థలాలను ప్రభుత్వం నుంచి టిటిడి కోనుగోలు చేసి అభివృద్ది చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టిటిడికి అందచేస్తారు.

సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా ఫిబ్రవరి నెలలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు నిర్వహించాలని నిర్ణయించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను సదస్సుకు ఆహ్వానిస్తామని టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ అర్చక కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న శ్రీ పెద్ద జియర్ మఠానికి రూ.60 లక్షల, శ్రీ చిన్న జియర్ మఠానికి రూ.40 లక్షలు ఆర్దిక సహాకారాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
టిటిడిలో పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.స్కిల్ కార్మికులకు రూ.15 వేల నుండి రూ.18,500కు, సెమిస్కిల్ కార్మికులకు రూ.12 వేల నుండి రూ.15 వేలకు, అన్‌స్కిల్ కార్మికులకు రూ.10,340 నుండి రూ.15 వేలకు పెంచినట్లు చెప్పారు. జీవో నెం. 110( 13..03..2023) ప్రకారం కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న పీస్‌ రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేలు కనీసం వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. అదే విధంగా రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారుకు ఆమోదం. తెలిపినట్లు చెప్పారు.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రం(రెండో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లు మండలి సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు.తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో పాలనా సౌలభ్యం కోసం రూ.6.15 కోట్లతో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి టెండరు ఆమోదం తెలిపామన్నారు.

దూరప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ రూ.7.31 కోట్లతో వంటషెడ్లు, మరుగుదొడ్ల బ్లాక్‌లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు టెండరు ఖరారుకు మండలి సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అదేవిధంగా, అలిపిరిలో రూ.7.24 కోట్లతో నూతన పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు టెండరు ఖరారు చేయడమే కాకుండా వీటితోపాటు రూ.1.94 కోట్లతో అలిపిరి బస్టాండు, పార్కింగ్ ప్రాంతంలో బిటి రెన్యువల్ రోడ్డు ఏర్పాటుకు టెండరుకు సమావేశంలో ఆమోదం లభించినట్లు చెప్పారు.తిరుమల హెచ్‌విసి ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీల్లో రూ.1.82 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు టెండరు ఆమోదం తెలిపామన్నారు.శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో బస చేసే భక్తుల సౌకర్యం కోసం శ్రీనివాసం తూర్పువైపున రూ.2 కోట్లతో ఓపెన్ డ్రెయిన్ నిర్మాణానికి , తిరుమలలో యాత్రికుల కాటేజీల్లో నివాసమున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం పాత పోలీసు క్వార్టరట్స్‌ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండరు ఖరారుకు సమావేశంలో ఆమోదం లభించినట్లు చెప్పారు.ప్రస్తుతం వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు రూ.6.32 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు టెండర్ల ఆమోదం లభించిందన్నారు.

గతంలో చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం మరియు శ్రీవారిమెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 2010వ సంవత్సరంలో రోడ్డు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం దారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో, పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా దీన్ని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి బిటి రోడ్డు, వీధిదీపాలు, డ్రెయిన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు రూ.17.29 కోట్లతో టెండరు ఖరారుకు సమావేశంలో ఆమోదం లభించిందని ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన జార్ఖండ్ రాష్ట్రం దేవ్ ఘర్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మించేందుకు ఆమోదం తెలిపామన్నారు. చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ప్రాకారం, కట్‌స్టోన్ ఫ్లోరింగ్, స్టోర్ గది, మండపం నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నుండి రూ.2 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టిటిడి ఈవో ఎవి. ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News