Sunday, December 22, 2024

దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : శ్రీనగర్ లోని దాల్ సరస్సులో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఐదు హౌజ్‌బోట్లు దగ్ధమయ్యాయి.  ఈ ప్రమాదంలో ముగ్గురు విదేశీ పర్యాటకులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మంటల్లో కాలిపోయిన ఓ పడవలో బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘాట్ నంబరు 9 వద్ద నిలిపి ఉంచిన ఓ హౌస్‌బోట్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగి పక్కనున్న మరికొన్ని పడవలకు అంటుకున్నాయి. ఐదుహౌస్‌బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, అనేక పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆస్తి నష్టం రూ. కోట్ల లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీస్‌లు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News