Wednesday, January 22, 2025

ఇంట్లోని చెత్తను చెత్త వాహనాలకే ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -
  • మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు

సిద్దిపేట: ఇంట్లోని చెత్తను చెత్త వాహనాలకే ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. శని వారం స్వచ్చ సిద్దిపేట నిర్మాణంలో బాగంగా సిద్దిపేట పట్టణంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి నడుస్తూ చెత్త వేరడం అనే కార్యక్రమాన్ని పట్టణంలోని 14వ వార్డులో నిర్వహించారు. అనంతరం రోడ్డు పక్కన, ఓపెన్ ప్లాట్‌లలో చెత్తను సేకరించి వేరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓపెన్ ప్లాట్లలలో చెత్తను వేసే వారిని చుట్టు ప్రక్కల ఉన్నటువంటి వారు గమనించి మందలించాలన్నారు. పట్టణంలోని ప్రజలందరు చెత్తను కేవలం మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలన్నారు. ఓపెన్ ప్లాట్‌లలో చెత్త వేస్తే దోమలు, ఈగల ద్వారా ప్రజలు ఆనారోగ్యాలకు గురవుతారన్నారు.

ప్రజలలో చాలా వరకు మార్పు రావడం జరిగిందని కొంత శాతం మందిలో మార్పు రావడం లేదన్నారు. ప్రజలు అధికారులందరికీ సహకరించాలన్నారు. వార్డులు బాగుంటే పట్టణం అందంగా కనిపిస్తుందన్నారు. సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం ఆలోచించే గోప్ప నాయకుడు మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలు తప్పకుండా చెత్తను తడి, పొడి , హానికరమైన చెత్తగా వేరు చేసి కేవలం మున్సిపల్ వాహానాలకు మాత్రమే అందించాలన్నారు. ఆరుబయట చెత్త వేసే వారికి జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సేకరించినటువంటి చెత్తను మూడు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించారు. వర్షాకాలం కావున పోడిచెత్తను ఎవరు కూడా ఆరుబయట వర్షం పడే చోట పెట్టకూడదన్నారు.

వార్డులోని గల్లీలు కలియతిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం మంత్రిహరీశ్‌రావు మున్సిపాలిటీ అధికారులు ప్రతిరోజు ప్లాస్టిక్ నిషేధంపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్న పట్టించుకోకుండా తిరిగి ప్లాస్టిక్ వాడటం పట్ల సంబంధిత వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా తప్పకుండా ఇంటి వద్ద నుండి ఖచ్చితంగా స్టీల్ బాక్స్‌లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరోసారి ఇలాంటివి పునరావృత్తం అయితే జరిమానాలు విధించడం జరుగుతుందని టిపిన్ సెంటర్ యజమానిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ నాయకులు ఆల్లకుంట మహేందర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News