Monday, December 23, 2024

త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

- Advertisement -
- Advertisement -
  • రెండు చోట్ల స్థలాల పరిశీలన
  • కలెక్టర్‌ను కలిసిన టియూడబ్లూజే నేతలకు హామీ
  • 64 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితా కలెక్టర్‌కు అందించిన టియూడబ్లూజె

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: టియూడబ్లూజె (హెచ్143) ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇతర జిల్లాల్లో ఇచ్చిన జీవోతో కూడిన ప్రొసిడింగ్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. దీనితో సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ తప్పకుండా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు చోట్ల స్థలాలను గుర్తించామని, జర్నలిస్టులు కోరుకున్న చోట ఇళ్ళ స్థలాలు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. సానుకూలంగా స్పందించి కలెక్టర్‌కు టియూడబ్లూజె నేతలు కృతజ్ఞతలు తెలిపి 64 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితాను కలెక్టర్‌కు అందించారు.

త్వరలో పట్టాలు: భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి

దీనిలో ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి సానుకూలంగా స్పందించి తప్పకుండా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఎంఎల్‌ఏ గండ్ర పేర్కొన్నారు. దీనితో అతి త్వరలో భూపాలపల్లిలో పనిచేసే జర్నలిస్టులు అందరికి ఇళ్ళ స్థలాలు రానున్నాయి. ఈ కార్యక్రమంలో టియూడబ్లూజె హెచ్ 143 జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు వంశీకృష్ణ, టెంజూ అధ్యక్షుడు సంపత్, రాష్ట్ర నాయకులు అల్లం హరి, మంతెన సమ్మయ్య, ఎర్రం సతీష్, సుధాకర్, తిక్క ప్రవీణ్, చిరంజీవి, జగన్, రంజిత్, రాంబాబు, శ్రీనివాస్, ప్రవీణ్, వెంకన్న, రవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News