Monday, December 23, 2024

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 50 గుడిసెలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

50 Huts gutted in Delhi

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని ఆనంద్ పర్వత ప్రాంతంలోని కఠ్ పుత్లీ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించి ఆ ప్రాంతంలోని 50 గుడిసెలకు నిప్పంటుకుంది.

అగ్నిమాపక దళంకు  ఫోన్ కాల్ అందగానే  మొత్తం 18 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసాయి. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపకదళ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన కారణం తెలియలేదు. అయితే  ఎటువంటి మానవ ప్రాణనష్టం కూడా సంభవించలేదని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News