Sunday, January 19, 2025

కూల్చివేతలపై స్టే

- Advertisement -
- Advertisement -

 హైకోర్టు నుంచి ఉత్తర్వులు
పొందిన మూసీ
పరీవాహకంలోని 100
ఇళ్ల యజమానులు
నివాసాలకు వెలిసిన హైకోర్టు
ఆదేశాలతో కూడిన పోస్టర్లు
నేడు మరిన్ని పిటిషన్లపై
న్యాయస్థానంలో విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్:  మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తమ ఇళ్లను కూల్చివేయ వద్దని హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో నివాసం ఉంటున్న మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు తమ ఇంటి వద్ద కోర్టు స్టేలను అంటించుకున్నారు. దాదాపు 100 ఇళ్ల యజమానులు కోర్టు నుంచి స్టే ఆర్డర్‌లను తెచ్చుకున్నట్లుగా సమాచారం. మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లు ఇవ్వమని ఇంటి యజమానులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపోరాటం చేయడానికి సిద్ధమని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీరివర్ బెడ్‌లోని ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

ఈ నిర్మాణాలను తొలగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఓ కార్యాచరణను సైతం రూపొందించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితుడికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసి పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగా దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్‌జోన్‌లో నివసిస్తున్న కుటుంబాల పునరా వాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. అలాగే, రివర్ బెడ్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు సైతం మార్గదర్శకాలు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆందోళన చెందిన మూసీ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News