Sunday, December 22, 2024

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నిరుపేదలందరికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కందికొండ గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మల్కాపూర్ గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకే కుటుంబంలో ఎక్కువ మంది చిన్న చిన్న ఇండ్లలో ఉంటున్నారని, పెళ్లైన కుటుంబాలు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఉందన్నారు.

నియోజకవర్గ కేంద్రాలలో కొన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించిన పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు అశోక్, నాగరాజు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News