Saturday, March 29, 2025

ఎన్నికల కోడ్ అయిపోగానే ఇండ్ల మంజూరు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఎన్నికల కోడ్ అయిపోగానే అర్హులకు, నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వంశీని గెలిపిస్తే వాగ్దానాలను నెరవేరుస్తామని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా చెప్పారు.

లక్ష కోట్లతో కట్టిన మేడిగడ్డ కుంగిపోయిందని, అదే డబ్బు సంక్షేమ పథకాలకు పెట్టి ఉంటే పేదలకు లబ్ధి చేకూరి ఉండేదన్నారు. బిఆర్ఎస్ అనాలోచిత విధానాలతో ప్రజాధనం వృథా అయిందన్నారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ తనను పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా మంత్రి శ్రీధర్ బాబే నిలబెట్టారని అన్నారు. తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News