Monday, November 25, 2024

బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

Housewife missing in Hyderabad

మన తెలంగాణ/ పేట్‌బషీరాబాద్ : ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిన ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కొంపల్లి రాయల్ పార్కు ప్రాంతానికి చెందిన హారిక (21) భర్త దత్తగౌడ్ భార్యా భర్తలు. ఇద్దరి మధ్య నెలకొన్న గొడవతో హారిక అ క్టోబర్ 29న ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకోలేదు. పుట్టింటికి వెళ్ళి ఉండొచ్చని భావించిన భర్త ఆమె కోసం పట్టించుకోలేదు. రోజులు కావస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆరా తీయగా అక్కడికి వెళ్ళలేదని తెలియడంతో తెలిసిన వారితో, బంధువుల ఇండ్లలో ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో పేట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News