Friday, January 24, 2025

దేశంలోనే పేద ప్రజలకు గృహ సముదాయం కేవలం సిద్ధిపేటలోనే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజా అవసరాలకు అనుగుణంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట కేసీఆర్ నగర్ లో 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన, అలాగే నమస్తే తెలంగాణ గ్రంథాలయం, అనంతరం కేసీఆర్ నగర్ పోచమ్మ దేవాలయ ఆవరణలో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేసీఆర్ నగర్-గుండ్ల చెరువులకు లక్షా 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పోలీసు ఔట్ పోస్ట్ ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఆదర్శవంతమైన చక్కటి కాలనీ నిర్మించి ఒక్కొక్కటిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. 2450 ఇండ్ల కాలనీ తక్కువ సమయంలో తీర్చిదిద్దుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాలనీ ఏర్పాటయ్యాక అంగన్ వాడీ, రేషన్ షాపు, పాఠశాల, నీటి ట్యాంక్ లతో పాటు అదనంగా లక్షా 50 వేల లీటర్ల మూడవ నీటి ట్యాంక్ పనులు ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. లో ఓల్టేజీ రూ.5.42 కోట్లతో 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు, పట్టణంలో ఇది 7వ సబ్ స్టేషన్, నియోజకవర్గంలో 44వ సబ్ స్టేషన్ అని, తెలంగాణ రాష్ట్రం రాకముందు 20 సబ్ స్టేషన్లు ఉండేవీ కావనీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవన్నీ వచ్చాయని చెప్పుకొచ్చారు.

Housing complex for poor people in country is only in Siddipet

నర్సాపూర్ కేసీఆర్ నగర్ లో పోలీసు ఔట్ పోస్ట్ తో ఇక్కడి ప్రజలకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోనే పేద ప్రజలకు గృహా సముదాయం కేవలం సిద్ధిపేటలోనే ఉన్నదని, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆదర్శవంతమైన కాలనీగా ఏర్పాటు టీఆర్ఎస్ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ నగర్ లో లబ్ధి పొందిన లబ్ధిదారులు ఇళ్ళు కిరాయి ఇస్తే, తాళం వేస్తే ఇళ్లు వాపస్ తీసుకుంటామని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. మరో వెయ్యి ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. ఎల్అండ్ టీ శిక్షణ కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగం సైతం ఇప్పిస్తామని తెలిపారు. త్వరలోనే గ్రూప్-4 కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నామని పేర్కొన్నారు. క్రమ శిక్షణ కలిగిన కాలనీగా పెద్దలు సహకరించాలని కేసీఆర్ నగర్ కాలనీ వాసులను కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News