Monday, December 23, 2024

పేద ప్రజల ఇండ్ల స్థలాలకు నష్టపరిహారం అందించాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామ పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలకు నష్టపరిహారం ఇచ్చి స్థలం ఇవ్వాలని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి ఆర్‌డిఓ కార్యాలయం ముందు నగరంపల్లి భూ లబ్ధిదారులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు.

అనంతరం జిఎస్‌ఆర్ మాట్లాడుతూ 1995 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన ఇళ్లు లేని సుమారు 100 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రెండు గుంటల చొప్పున 5 ఎకరాలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ యొక్క భూమి మొత్తం కూడా ఓసి త్రీ భూ సేకరణలో ఉన్నందున ఈ వంద లబ్ధిదారులకు గజాల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గణపురం తహసీల్దారుకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News