Monday, December 23, 2024

యెమెన్ తీరంలో యుఎస్ నౌకపై హౌతీ రెబెల్స్ క్షిపణి దాడి

- Advertisement -
- Advertisement -

ఏడెన్ జలసంధిలో ఘటన
ఆ ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తత

జెరూసలెం : ఏడెన్ జలసంధిలో యెమెన్ తీరంలో అమెరికా యాజమాన్యంలోని ఒక నౌకపై హౌతీ రెబెల్స్ ఒక క్షిపణితో దాడి చేశారు. ఎర్ర సముద్రంలో ఒక అమెరికన్ డిస్ట్రాయర్‌పై నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణిపై హౌతీ రెబెల్స్ దాడి జరిపి ఒక రోజు కూడా పూర్తి కాక ముందే ఈ ఘటన చోటు చేసుకున్నది. హౌతీలు ప్రకటించుకున్నట్లుగా జిబ్రాల్టర్ ఈగల్‌పై దాడి వల్ల ఎర్ర సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెబెల్స్‌పై అమెరికా సారథ్యంలో దాడుల తరువాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హౌతీల దాడుల వల్ల ప్రపంచ స్థాయి నౌకా రవాణాపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐరోపా దిశగా సూయజ్ కాలువలకి ఆసియా, మధ్య ప్రాచ్య ఇంధన, సరకు రవాణా నౌకల రవాణాను అనుసంధానించే కీలక కారిడార్ లక్షంగా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. ఏడెన్‌కు ఆగ్నేయంగా సుమారు 110 మైళ్లు (177 కిలో మీటర్లు) దూరంలో సోమవారం దాడి చోటు చేసుకున్నదని మధ్య ప్రాచ్య జలాలలపై పర్యవేక్షణ సాగించే యునైటెడ్ కింగ్‌డమ్ సాగర ప్రాంత వాణిజ్య కార్యకలాపాల (యుకెఎంటిఒ) సంస్థ వెల్లడించింది.

హౌతీల దాడికి గురైన నౌక మార్షల్ దీవుల ఆధ్వర్యంలోని భారీ నౌక ఈగల్ జిబ్రాల్టర్ అని అని ప్రైవేట్ భద్రత సంస్థలు ఆంబ్రీ, ద్రైయాడ్ గ్లోబల్ తెలిపాయి. యుఎస్ మిలిటర్ సెంట్రల్ కమాండ్ ఆ తరువాత ఆ దాడిని ధ్రువీకరించింది. నౌకలో ఎవరికీ గాయాలు కాలేదని, గణనీయమైన నష్టం వాటిల్లలేదని, అది తన ప్రయాణాన్ని కొనసాగించిందని సెంట్రల్ కమాంద్ తెలిపింది. కాగా, ఆ దాడి జరిపింది తామేనని హౌతీ మిలిటర్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ప్రకటించారు. ఆమేరకు రికార్డ్ చేసిన టివి ప్రసంగాన్ని సోమవారం రాత్రి ప్రసారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News