Wednesday, January 22, 2025

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం తగునా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హిందుత్వాన్ని.. బిజెపిని టార్గెట్ చేస్తూ రాష్ట్ర సిఎంవో అధికారి విమర్శలు చేయడం సర్వసాధారణంగా మారిందని హిందూ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి ఆరోపించారు. మణిపూర్ ఘటనను ఊటంకిస్తూ.. ‘నైతికత లేని మెజార్టీ ప్రజలతో ప్రమాదం’ అంటూ హిందువులను విమర్శించారు. ‘ఒక ఉన్నత స్థాయి అధికారిగా ఉంటూ పార్టీల మధ్య, మతాల మధ్య వ్యత్యాసాలు చూపడం తగునా?’అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై స్పందిస్తే మహిళా సమాజానికి మేలు జరిగేది అన్నారు. ‘మహిళలపై జరిగే అఘాయిత్యాలపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా స్పందించే మహిళా అధికారి.. తన చుట్టూ జరిగే సంఘటనలను పక్కదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా స్పందిస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ.. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం తగునా? ’అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News