Wednesday, January 22, 2025

షర్మిల నాయకత్వం వహిస్తామంటే ఊరుకుంటామా?

- Advertisement -
- Advertisement -
రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడ ఉన్నన్ని రోజులు వైఎస్ షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొంది తెలంగాణ వాళ్లు పాలించుకోవడం కోసమేనన్నారు. వైఎస్ ఫర్మిల వచ్చి తెలంగాణలో నాయకత్వం వహిస్తామంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో పనిచేస్తే స్వాగతిస్తానని చెప్పారు. వైఎస్ షర్మిల ఎపిసిసి చీఫ్ అయితే సహచర పిసిసి చీఫ్‌గా కలుస్తానన్నారు. కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌ను ఇటీవల వైఎస్ షర్మిల కలిశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టిపిని వైఎస్ షర్మిల విలీనం చేస్తారని ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. తమ పార్టీని ఏ పార్టీలో విలీనం చేయబోనని చెప్పారు. అయితే వైఎస్ షర్మిలపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో కూడ ఇదే రకమైన విమర్శలు చేశారు.

తెలంగాణ తెచ్చుకొని ఇతరుల పెత్తనాన్ని సహిస్తామా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల అదే స్థాయిలో స్పందించారు. సోనియాతో లింకుపెట్టి రేవంత్‌రెడ్డిపై వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నేతల్లో జోష్ వచ్చింది. మరో ఆరు మాసాల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. కర్ణాటకలో డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌తో షర్మిల సమావేశం కావడంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ సాగుతుంది. కర్ణాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్ తో వైఎస్ షర్మిల మధ్య పరిచయం కారణంగా అతడిని కలిసి ఉండొచ్చని కర్ణాటక ఇంచార్జీ మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ప్రకటిం చిన విషయం విదితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News