Wednesday, January 22, 2025

ఎన్నికల ముందు ఎందరిని జైలులో పెడతారు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఒక యూట్యూబర్‌కు మంజూరైన బెయిల్‌ను సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ జైలులో పెట్టజాలరని కోర్టు వ్యాఖ్యానించింది. తనకు మంజూరైన స్వేచ్ఛను ఎ దురైమురుగన్ సట్టై దుర్వినియోగం చేశారనేందుకు దాఖలాలు ఏవీ లేవని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.

తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి జస్టిస్ ఓకా విచారణ సమయంలో ఒక కీలక ప్రశ్న వేశారు. ‘ఎన్నికలకు ముందు యూట్యూబ్‌లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనుకకు పంపడాన్ని మనం ప్రారంభించినట్లయితే ఎంత మంది జైలులో ఉంటారో ఊహించండి’ అని జస్టిస్ ఓకా అన్నారు. బెయిల్‌పై ఉండగా దురుద్దేశంతో వ్యాఖ్య చేయకుండా సట్టైను నిరోధించాలన్న షరతు విధించాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఒక ప్రకటన దురుద్దేశంతో చేసిందని ఎవరు నిర్ధారిస్తారని ముకుల్ రోహత్గిని జస్టిస్ ఓకా అడిగారు. తన బెయిల్‌ను మద్రాసు హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సట్టై దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News