Monday, December 23, 2024

పదేండ్లలో ఎంత మంది యువకులకు ఉద్యోగాలొచ్చాయి: ప్రియాంక

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: మహిళల కష్టాలు ఏమిటో తనకు తెలుసునని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలిపారు. తొర్రూర్‌లో జరిగిన బహిరంగా సభలో ప్రియాంక ప్రసంగించారు. తెలంగాణలో రైతులు కష్టాల్లో ఉన్నారని, రైతుల నుంచి బిఆర్‌ఎస్ భూములు లాక్కుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బూటకపు మాటలు నమ్మొద్దని హితువు పలికారు. త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, పదేండ్లలో ఎంత మంది యువకులకు ఉద్యోగాలొచ్చాయని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వమే పేపర్ లీకులు చేస్తుండడంతో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెష్ పాలిత రాష్ట్రాల్లోనే ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉందని, రాజస్థాన్‌లో రెండు లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరిగితే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రియాంక గాంధీ అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News