Wednesday, January 22, 2025

రాష్ట్రపతి పదవికి సత్తా ఉన్న అభ్యర్థిని ప్రతిపక్షాలు నిలబెడతాయా?: శివసేన

- Advertisement -
- Advertisement -
Opposition on Rashtrapathi candidate
రాష్ట్రపతి కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది,  జూలై 18న ఆయన వారసుడి కోసం ఎన్నిక జరగనుంది.

ముంబై: రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు బలమైన అభ్యర్థిని నిలబెట్టలేకపోతే… ప్రతిపక్షాలు సమర్థుడైన ప్రధానిని మాత్రం ఎలా ఇస్తాయని ప్రజలు అడగొచ్చని శివసేన శుక్రవారం పేర్కొంది.  తదుపరి రాష్ట్రపతి ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్‌ అబ్దుల్లాలకు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వినిపించనున్న సాధారణ పేర్లు, అయితే దానిని తీవ్రతరం చేసే  వ్యక్తిత్వం లేదా ధైర్యం ప్రతిపక్షాలకు లేవని శివసేన పార్టీ తన స్వంత పత్రిక  ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. ప్రతిపక్షాలు రాష్ట్రపతి ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవడం తగదని పరోక్షంగా హెచ్చరించింది.

కాంగ్రెస్, డిఎంకె, ఎన్‌సిపి, సమాజ్‌వాదీ పార్టీతో సహా 17 ప్రతిపక్ష పార్టీలు జూన్ 15న ఢిల్లీలో   బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ  అభ్యర్థిపై తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంలో ఏకాభిప్రాయం సాధించేందుకు,  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి హాజరయ్యారు.

ప్రతిపక్షాలు రాష్ట్రపతి ఎన్నికలకు బలమైన అభ్యర్థిని నిలబెట్టలేకపోతే, ఇక  2024లో సమర్థుడైన ప్రధానమంత్రిని ఎలా ఇవ్వగలవు? ఈ ప్రశ్న ప్రజల మదిలో మెదులుతోందని శివసేన పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News