Monday, December 23, 2024

తెలంగాణ దాహం ఎలా తీరిందంటే…

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కెటిఆర్ ట్వీట్‌లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘ది వైర్’ అనే వెబ్‌సైట్‌లో ‘హౌ తెలంగాణాస్ ఏజ్ ఓల్డ్ థర్స్ వాజ్ క్వించ్డ్ (తెలంగాణ దాహం ఎలా తీరిందంటే)’ అనే శీర్షికన ఆర్టికల్‌ను ప్రచురించింది. ఆ ఆర్టికల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేయడంతో దానిపై నెటిజన్‌లు భారీగా స్పందించడంతో పాటు ఆ కథనాన్ని ప్రశంసించారు.

‘ది వైర్’ అనే వెబ్‌సైట్‌లో రాసిన కథనం ఇలా…

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలు సాగునీటి కోసం, తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. కెసిఆర్ నాయకత్వంలో సాగిన సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది. అప్పటి నుంచి కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారింది. రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు తదితర పథకాలతో తెలంగాణ పేదల జీవితాల్లో కెసిఆర్ ప్రభుత్వం వెలుగులు నింపింది. అదేవిధంగా మిషన్ భగీరథ పేరుతో బృహత్తర పథకం చేపట్టి కెసిఆర్ రాష్ట్ర ప్రజల తాగునీటి కష్టాలను తీర్చారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్థసాధక సాగునీటి ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేసి తెలంగాణలో మెజారిటీ భూ భాగానికి సాగునీటి సమస్యను పరిష్కరించంటూ ‘ది వైర్’ వెబ్‌సైట్‌లో కథనం రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News